భగ్గుమన్న డీజిల్‌

ABN , First Publish Date - 2021-10-08T04:52:34+05:30 IST

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. లీటర్‌ ధర సెంచరీ దాటడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. అయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.109.62 కాగా, డీజిల్‌ ధర 101.65 ఉంది. ఈ ధరలు జిల్లాలోని పలు ప్రాంతాలలో కాస్త అటు ఇటుగా ఉంటాయి. ఈ నెలలో వారం రోజుల వ్యవధిలో ఐదుసార్లు ధరలు పెరిగాయి.

భగ్గుమన్న డీజిల్‌

- లీటర్‌ ధర రూ.101.65

- రూ.110కి చేరువలో పెట్రోల్‌ 

- ఆందోళన చెందుతున్న వినియోగదారులు 

(రాజాం రూరల్‌)

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. లీటర్‌ ధర సెంచరీ దాటడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. అయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ రూ.109.62 కాగా, డీజిల్‌ ధర 101.65 ఉంది. ఈ ధరలు జిల్లాలోని పలు ప్రాంతాలలో కాస్త అటు ఇటుగా ఉంటాయి. ఈ నెలలో వారం రోజుల వ్యవధిలో ఐదుసార్లు ధరలు పెరిగాయి. ఈ నెల 1న లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.16 కాగా, డీజిల్‌ ధర రూ.99.97 ఉండేది. 2న పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 32పైసలు పెరిగింది. నిత్యం లీటర్‌పై 30 పైసల నుంచి 50 పైసలు మేర చాపకింద నీరులా పెరుగుతూ వస్తోంది. ముందు ముందు ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులే చెబుతున్నారు. గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా అమాంతంగా పెరుగుతున్నాయి. తాజాగా గ్యాస్‌ ధర రూ.15 పెరిగి రూ.924కి చేరింది. దీనికి రవాణాచార్జీలు అదనం. 


సామాన్యులపై పెనుభారం...

పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పెనుప్రభావం చూపుతోంది. రెండేళ్లుగా కరోనా కారణంగా ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు జీవనమే గగనంగా మారింది. వ్యాపారాలు సన్నగిల్లాయి. ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. వందలాది మంది ప్రైవేటు ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా పెట్రో, గ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే ప్రధాన కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో డీజిల్‌, పెట్రోల్‌ ధరలు మనకన్నా.. లీటర్‌పై రూ.10వరకు తక్కువగా ఉన్నాయి. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను కొంతమేర తగ్గించడమే ఇందుకు కారణం. తమిళనాడులో గతంలో పెట్రో ఉత్పత్తులపై లీటర్‌కు 15 శాతం పన్ను వసూలు చేయగా, ప్రస్తుతం 13 శాతానికి కుదించింది. మన రాష్ట్రంలో కూడా పన్నులు తగ్గిస్తే.. వాహనదారులపై కాస్త భారం తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-10-08T04:52:34+05:30 IST