Advertisement
Advertisement
Abn logo
Advertisement

న్యూజిలాండ్‌పై విజయం అంత ఈజీగా రాలేదు: రోహిత్ శర్మ

జైపూర్: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ విజయం చివరికి అంత ఈజీగా లభించలేదని, ఈ అనుభవం నుంచి కుర్రాళ్లు నేర్చుకుంటారని అన్నాడు.


టీ20 ఫుల్‌టైం కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది తొలి మ్యాచ్.. తొలి విజయం. న్యూజిలాండ్ నిర్దేశించి 165 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ సేన తొలుత దూకుడుగా ఆడినప్పటికీ చివరల్లో కొంత తడబడింది. చివరి ఓవర్ నాలుగో బంతికి పంత్ ఫోర్ కొట్టడంతో విజయం భారత్ సొంతమైంది. 


అనుకున్నంత సులభంగా ఈ విజయం తమకు దక్కలేదని రోహిత్ పేర్కొన్నాడు. మనకేం కావాలో అర్థం చేసుకునేందుకు కుర్రాళ్లకు ఇది గొప్ప అనుభవమన్నాడు. అన్ని వేళలా పవర్ హిట్టింగ్ సరికాదని రోహిత్ చెప్పుకొచ్చాడు. కుర్రాళ్లు మ్యాచ్‌ను ఫినిష్ చేసినందుకు ఆనందంగా ఉందన్నాడు. తమకు ఇది చాలా మంచి గేమ్ అని పేర్కొన్నాడు.


మిడిల్‌లో సూర్యకుమార్ చాలా కీలకమైన ఆటగాడని, స్పిన్‌ను అద్భుతంగా ఎదుర్కొంటాడని ప్రశంసించాడు. ముంబై ఇండియన్స్ టీమ్మేట్ ట్రెంట్ బౌల్ట్‌కు తన బలహీనత ఏంటో తెలుసని, తనకు అతడి బలమేంటో తెలుసని అన్నాడు. ఏది ఏమైనా ఈ విజయం ఆనందాన్ని ఇచ్చిందని, తొలి గెలుపు ఎప్పటికీ గొప్పదేనని రోహిత్ అన్నాడు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement