Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 20:38:44 IST

Manushi Chillar: ‘లాల్ సింగ్ చడ్డా’ లో హీరోయిన్ పాత్రకు నో చెప్పిన అందాల భామ.. అందుకు కారణమేంటంటే..

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha). టామ్ హ్యాంక్స్ హిట్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించింది. కానీ, ఈ పాత్ర కోసం ముందుగా ‘మిస్ యూనివర్స్-2017’ టైటిల్ విజేత మానుషి చిల్లర్ (Manushi Chhillar)ను సంప్రదించారు. ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వాలి. కానీ, ‘లాల్ సింగ్ చడ్డా’ లో హీరోయిన్ పాత్రను మానుషి రిజెక్ట్ చేసింది. అందుకు కారణమేంటంటే..   


‘లాల్ సింగ్ చడ్డా’ లో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించే సమయానికే మానుషి చిల్లర్‌ ఓ చిత్రానికి సంతకం చేసింది. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలిమ్స్‌తో కాంట్రాక్ట్‌లో ఉంది. ఆ సంస్థ భారీ చిత్రంతో లాంచ్ చేస్తామని మానుషికీ మాటిచ్చింది. ఫలితంగా ఆమె ఎటువంటి ఆలోచన చేయకుండా ‘లాల్ సింగ్ చడ్డా’లో హీరోయిన్ పాత్రకు నో చెప్పింది. యశ్ రాజ్ ప్రొడక్షన్స్ అన్నట్టుగానే ఆమెను ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj) వంటి భారీ ప్రాజెక్టుతో లాంచ్ చేసింది. ఈ సినిమా విడుదలకు ముందే ఆమెకు భారీగా ఆఫర్స్ వెలువెత్తాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద మూవీ పరాజయం పాలవ్వడంతో ఆఫర్స్ తగ్గిపోతాయి. ప్రస్తుతం మనూషి చిల్లర్ చేతిలో ఓ ప్రాజెక్టు మాత్రమే ఉంది. ‘టెహరాన్’ (Tehran) లో నటిస్తుంది. జాన్ అబ్రహాం (John Abraham) హీరోగా నటిస్తున్నాడు. అరుణ్ గోపాలన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ విషయానికి వస్తే.. అక్షయ్ కుమార్ (Akshay Kumar)హీరోగా నటించాడు. చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) రూ. 200కోట్ల భారీ బడ్జెట్‌తో  నిర్మించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల అయింది. సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజయం సాధించలేదు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement