Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 30 Nov 2021 13:00:23 IST

నెయ్యి ఎక్కువగా వాడతానన్న Hrithik Roshan.. కారణం ఏంటో తెలుసా..

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఎంత ఫిట్‌గా ఉంటాడో తెలిసిందే. అలా ఉండటానికి రోజు వ్యాయామం చేయడమే కాకుండా ఖచ్చితమైనా డైట్ ఫాలో అవుతాడు ఈ సూపర్ హీరో. ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్నాడీ స్టార్ హీరో.


‘నా డైట్‌లో సమయానికి తగ్గట్లు మార్పు చేస్తాను. అది కూడా మూడు గంటలకొకసారి కొంచెం కొంచెంగా తీసుకుంటాను.

రోజుకి సగటున 5 లేదా 6 గంటలు నిద్రపోతాను. నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం. అది ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఎంతో మంచిది. అందుకే తప్పనిసరిగా తీసుకుంటాన’ని హృతిక్ చెప్పాడు.


నెయ్యి వాడటం వల్ల ఉపయోగాలు ఇలా..

కళ్ల కింద నల్లటి చారలు రావడం మామూలే. వాటిని పోగొట్టకోడానికి క్రీమ్స్ రాస్తుంటారు. దానికి బదులు ముందు రోజు రాత్రి పడుకునే ముందు నెయ్యి రాసుకొని ఉదయాన్నే కడిగేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. 


పెదవులు పలిగినప్పుడు లిప్ బామ్‌కి బదులు నెయ్యిని వాడొచ్చు.


వెంట్రుకలు ఊడే వాళ్లు, చుండ్రు ఉన్నవాళ్లు కూడా నెయ్యి వాడకం ద్వారా సమస్య నుంచి బయటపడొచ్చు.


ఆలివ్ నూనె, కొబ్బరి నూనెలో నెయ్యి కూడా జోడించి జుట్టుకి రాసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.


నెయ్యి కూడా మాయిశ్చరైజర్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. బాడీ ఆయిల్ లాగా, శరీరానికి బారకుండా ఉండటానికి వాడవచ్చు.


అయితే, వరుస సినిమాలతో బిజీగా ఉన్న హృతిక్.. ప్రస్తుతం తమిళ మూవీ ‘విక్రమ్ వేద’కి రిమేక్‌గా వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement