తాజ్‌ మహల్ కట్టిన కూలీల చేతులను షాజహాన్ తెగనరికించాడా? దీనిలో నిజమెంత? చరిత్ర ఏం చెబుతోంది?

ABN , First Publish Date - 2022-02-19T17:59:45+05:30 IST

ఆగ్రాలో ప్రతి సంవత్సరం తాజ్ ఫెస్టివల్..

తాజ్‌ మహల్ కట్టిన కూలీల చేతులను షాజహాన్ తెగనరికించాడా? దీనిలో నిజమెంత? చరిత్ర ఏం చెబుతోంది?

ఆగ్రాలో ప్రతి సంవత్సరం తాజ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 20న ఈ ఉత్సవం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రపంచంలోని అనేక దేశాల నుండి పర్యాటకులు తాజ్‌ను తిలకించేందుకు ఇక్కడికి చేరుకుంటారు. కాగా తాజ్‌ మహల్ ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా అక్కడి వింతలు, విశేషాలు చర్చకు వస్తాయి. తాజ్ మహల్ నిర్మాణం తర్వాత, దానిని కట్టిన చేసిన కూలీల చేతులు షాజహాన్ నరికవేయించాడని చెబుతారు. దీనిలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం. షాజహాన్‌కు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నప్పటికీ.. అతను ముంతాజ్ మహల్‌ను అమితంగా  ప్రేమించాడు. 


బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం షాజహాన్ భార్య ముంతాజ్ మహల్. ఆమె జీవించి ఉన్నంత కాలం షాజహాన్ ఆమెకు ఇతర భార్యలకన్నా అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ముంతాజ్ లేకుండా షాజహాన్ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడని షాజహాన్ ఆస్థాన చరిత్రకారుడు ఇనాయత్ ఖాన్ తన పుస్తకంలో రాశాడు. తాజ్ మహల్ నిర్మాణం వెనుక ముంతాజ్ కల దాగుంది. షాజహాన్ సింహాసనాన్ని అధిష్టించిన 4 సంవత్సరాల తరువాత ముంతాజ్ మరణించింది. తన మరణానికి ముందు చివరి క్షణాల్లో ముంతాజ్ చక్రవర్తితో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అందమైన ప్యాలెస్, ఉద్యానవనం తన కలలో కనిపించాయని, తన జ్ఞాపకార్థం అలాంటి సమాధిని నిర్మించాలని ఆమె కోరింది. ఈ నేపధ్యంలోనే తాజ్ మహల్‌కు పునాది పడింది. ఇక షాజహాన్ తాజ్ మహల్‌ను నిర్మించిన కూలీల చేతులను నరికివేయించాడా? అనే ప్రశ్న విషయాకి కొస్తే.. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం... తాజ్ మహల్  గైడ్‌లు ఈ కథనాన్ని చాలా ఉత్సాహంగా వివరిస్తారు. ఈ విషయం పర్యాటకుల్లో కూడా చర్చనీయాంశంగా నిలిచింది. ఎందుకంటే ఈ ప్రపంచ వింతను చూసిన తర్వాత, ఇది నిజమేమోననే భావన కలుగుతుంది. అయితే ఇది కేవలం ఊహ మాత్రమేనని స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు చరిత్రలో దీనికి  ఆధారాలు అభించలేదు. చరిత్రకారులు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేదు. కాగా షాజహాన్ తాజ్ మహల్ నిర్మాణంలో అన్ని రకాల విలువైన రాళ్లను వినియోగించాడు. ఇందుకోసం చాలా కాలం పాటు కళాకారుల బృందం శ్రమించింది. ఈ విషయం షాజహాన్ జీవిత చరిత్ర 'షాజహాన్ ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది మొఘల్ ఎంపరర్'లో ప్రస్తావించారు. ఈ జీవిత చరిత్రను ఫెర్గస్ నికోల్ రాశారు. తాజ్ మహల్‌ను నిర్మించిన కార్మికులలో ఎక్కువ మంది కన్నౌజ్‌కు చెందిన హిందువులే అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-02-19T17:59:45+05:30 IST