డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన'కు హీరో దొరికేశాడని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని పూరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయాలని చాలా ట్రై చేశారు. కానీ, మహేశ్‌కు ఈ కథ అంతగా నచ్చక పోవడంతో పక్కన పెట్టేశారట. ఆ తర్వాత ఇదే కథను పలువురు స్టార్ హీరోలతో చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. గత ఏడాది పూరి కూడా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. కానీ, అలాంటి అప్డేట్ ఏదీ 'జనగణమన'కు సంబంధించి రాలేదు. అయితే, తాజాగా ఈ సినిమాను టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేసేందుకు పూరి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో 'లైగర్' అనే పాన్ ఇండియన్ సినిమా రూపొందుతోంది. దీని తర్వాత మళ్ళీ విజయ్‌తోనే నెక్స్ట్ సినిమాను కూడా పూరి చేయనున్నట్టు..అది 'జనగణమన' ప్రాజెక్ట్ అని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై పూరి లేదా విజయ్ దేవరకొండ స్పందిస్తారేమో చూడాలి.