టీఆర్‌ఎ్‌సకు తిరుగులేదు

ABN , First Publish Date - 2022-01-29T04:36:23+05:30 IST

‘‘మెదక్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఆరాటం కేవలం వారి ఉనికిని కాపాడుకోవడం కోసమే. టీఆర్‌ఎ్‌సకు ధీటు గా నిలబడే సత్తా ఉన్న పార్టీలు జిల్లాలో ఎక్కడైనా ఉన్నాయా?’’ అని మెదక్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ప్రశ్నించారు

టీఆర్‌ఎ్‌సకు తిరుగులేదు
మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి

ఉనికి కోసమే కాంగ్రెస్‌, బీజేపీ ఆరాటం

అందరిని కలుపుకుని ముందుకెళ్తా 

త్వరలోనే మెదక్‌ జిల్లాలో పర్యటిస్తా 

‘ఆంధ్రజ్యోతి’తో ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ మెదక్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి


  ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, జనవరి 28: ‘‘మెదక్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఆరాటం కేవలం వారి ఉనికిని కాపాడుకోవడం కోసమే. టీఆర్‌ఎ్‌సకు ధీటు గా నిలబడే సత్తా ఉన్న పార్టీలు జిల్లాలో ఎక్కడైనా ఉన్నాయా?’’ అని మెదక్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ మెదక్‌ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మరిన్ని విషయాలను పంచుకున్నారు. 

 ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఒకే సమయంలో రెండు బాధ్యతలు ఎలా నిర్వహిస్తారు? 

 పార్టీ బాధ్యతలు చూడడం నాకు కొత్తేం కాదు. గతంలో ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలిగా, కన్వీనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. కాబట్టి పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానన్న నమ్మకం నాకు ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మరోసారి జిల్లా బాధ్యతలను మా అధినేత కేసీఆర్‌ నాకు అప్పగించడం వలన నా బాధ్యత మరింత పెరిగింది.  ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా పని చేస్తూనే పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. అటు ప్రజలకు, ఇటు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాను. 

 ఇటీవల కాలంలో మెదక్‌ జిల్లాలో బీజేపీ పుంజుకుంటుంది. దీనిని ఎలా ఎదుర్కొంటారు? 

 మెదక్‌ జిల్లాలో బీజేపీ ఎక్కడుంది. ప్రజల్లో బీజేపీకి ఆదరణ లేకనే ఉనికి కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడే కాదు ఎప్పటికీ బీజేపీ పుంజుకోవడం, టీఆర్‌ఎ్‌సను ఎదుర్కోవడం అనేది జరగదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మోదీ పాలనలో ఏ వర్గం బాగుందో చెప్పండి. ఓట్ల కోసం మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం తప్ప ఏమీ లేదు. నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తానన్న మోదీ ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు. కోటి ఉద్యోగాల హామీ ఎందుకు నెరవేర్చడం లేదు.  

 మొదటి నుంచి కాంగ్రె్‌సకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంటుంది. జిల్లాలోనూ ఉంది. దాన్ని ఎలా చీల్చుతారు? 

 కాంగ్రె్‌సకు ఇప్పటి వరకు ఓటు బ్యాంకు ఉందని నేనైతే అనుకోవడం లేదు. పార్టీకి సరైన లీడర్‌, క్యాడర్‌ లేకుండా సతమతమవుతున్నారు. కేసీఆర్‌కు మించిన నాయకుడు రాష్ట్రంలో లేడు. గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులు చేస్తున్న టీఆర్‌ఎస్‌ వైపు ప్రజలు నిలుస్తున్నారు. అలాంటప్పుడు కాంగ్రె్‌సకు ఇంకా ఓటు బ్యాంకు ఉంటుందా? 

 పార్టీలో పదవులు లేక చాలా మంది కొంత నైరాశ్యంతో ఉన్నారు. వారందరినీ ఎలా ఒకే తాటిపైకి తెస్తారు?

టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నది కాబట్టి పదవులను ఆశించడం సహజం. పార్టీలో అందరికీ సమన్యాయం చేస్తున్నాం. కష్టపడి పని చేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. టీఆర్‌ఎ్‌సలో నైరాశ్యం అనేది ఉండనే ఉండదు. ఎప్పుడు ఉత్సాహంతో పని చేయడం టీఆర్‌ఎస్‌ నాయకులకు, కార్యకర్తలకే సాధ్యం. త్వరలోనే అంతటా పర్యటించి వారందరి అభిప్రాయం మేరకు కార్యవర్గం ఏర్పాటు చేస్తాం. 

 పార్టీ పదవుల్లో ఏఏ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? జిల్లా కార్యవర్గాన్ని ఎలా నిర్వహిస్తారు? 

టీఆర్‌ఎస్‌ అంటేనే అన్ని వర్గాలది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు పార్టీలో సరైన గౌరవం దక్కేలా చూస్తాం. పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ, జడ్పీ చైర్‌పర్సన్‌, ఇతర ముఖ్య నేతల సలహాలు, సూచనలు తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తాం.

టీఆర్‌ఎ్‌సలో ఉన్న అసమ్మతిని ఎలా ఎదుర్కొంటారు? 

 గిట్టని వారు చేసే ప్రచారం తప్ప మెదక్‌ జిల్లా పార్టీలో అసమ్మతి అనేది ఒట్టిమాటే. పార్టీలో అందరం కలిసే ఉన్నాం. 

వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు?

 ఈ రెండేళ్లు నాకు ఒక రకంగా పరీక్ష కాలం. ముఖ్యంగా జిల్లాలోని రెండు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఇందుకోసం ప్రణాళిక బద్ధంగా పనిచేస్తా. మా అధినేత కేసీఆర్‌, జిల్లా మంత్రి హరీశ్‌రావు సూచనలు, సలహాలతో పని చేస్తాను. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి వారి సూచనల మేరకు ఎన్నికలను ఎదుర్కొంటాం. 

 మెదక్‌ జిల్లా టీఆర్‌ఎ్‌సకు మొట్టమొదటి అధ్యక్షురాలు, మొదటి మహిళా అధ్యక్షురాలు కూడా, పార్టీలో మున్ముం దు మీ ముద్రను ఎలా చాటుకుంటారు? 

తినబోతూ రుచులు ఎందుకు? నా పని తీరు ఎలా ఉంటుందో మున్ముందు చూస్తారు. గతంలో కూడా నేను టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశాను. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ మరింత బలోపేతం చేయడమే నా లక్ష్యం. పార్టీ కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం 24 గంటలు కష్టపడతా. ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. 

Updated Date - 2022-01-29T04:36:23+05:30 IST