IPL 2022 నుంచి తప్పుకోవడానికి కారణం చెప్పిన Chris Gayle

ABN , First Publish Date - 2022-05-09T01:06:58+05:30 IST

లండన్ : టీ20 క్రికెట్ లో ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్ గేల్.. ఐపీఎల్ 2022 నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటో చెప్పాడు.

IPL 2022  నుంచి తప్పుకోవడానికి కారణం చెప్పిన Chris Gayle

లండన్ : టీ20 క్రికెట్ లో ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాళ్లలో ఒకడైన క్రిస్ గేల్.. ఐపీఎల్ 2022 నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటో చెప్పాడు. సుముచిత గౌరవం దక్కలేదని, గత రెండేళ్లలో ఐపీఎల్ కు ఎంతో చేసినా తనపట్ల సరిగ్గా వ్యవహరించలేదని అన్నాడు. ఈ కారణంగా ఐపీఎల్ 2022 నుంచి వైదొలగానని వెల్లడించారు. కాగా వెస్టిండీస్ కు చెందిన ఈ క్రికెట్ దిగ్గజం ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి 3 ఫ్రాంచైజీలకు ఆడాడు. కలకత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తర్వాత పంజాబ్ కింగ్స్ కు ఆడాడు. అయితే 2019లో సీజన్ లో అద్భుతంగా రాణించిన క్రిస్ గేల్ ఆ తర్వాత 2020, 2021లో పంజాబ్ కింగ్స్ కు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గతేడాది 10 మ్యాచ్ లు ఆడిన గేల్ 125.32 స్ట్రైయిక్ రేట్ తో కేవలం 193 పరుగులు మాత్రమే చేశాడు. అంతక్రితం 2020లో 7 మ్యాచ్ లు ఆడి 288 పరుగులు సాధించాడు. 


గత రెండేళ్ల ఐపీఎల్ జరిగిన తీరు చూస్తే తన పట్ల సరిగా వ్యవహరించలేదని అర్థమవుతోందని మిర్రర్.ఇన్ .యూకేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్ గేల్ చెప్పాడు. క్రికెట్,  ఐపీఎల్ కి ఎంతో చేసినా సముచిత గౌరవం దక్కలేదు. కానీ ఏం చేస్తాం. సరిపెట్టుకుందాం అనుకున్నా. డ్రాఫ్ట్ గా మిగిలి బాధపడకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే ఐపీఎల్ 2022 ఆడకూడదని నిర్ణయించుకున్నానని తెలిపాడు. క్రికెట్ తర్వాత జీవితం ఉంటుంది. ఆ సాధారణ స్థితిని గడిపేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. అయితే వచ్చే ఏడాది ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ఆర్ సీబీ లేదా పంజాబ్ కింగ్స్ టైటిల్ గెలవడాన్ని ఇష్టపడతానని చెప్పాడు. వాళ్లకు అవసరమైతే వచ్చే ఏడాది వస్తా. ఐపీఎల్ లో కోలకతా, ఆర్ సీబీ, పంజాబ్ టీంలకు గౌరవమిస్తానని చెప్పాడు. కాగా మొత్తం 142 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన క్రిస్ గేల్ మొత్తం 4,965 రన్స్ కొట్టాడు. 2013లో పుణె వారియర్స్ పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ 175 పరుగులు సాధించాడు.

Read more