రాష్ట్రంలో నియంత పాలన

ABN , First Publish Date - 2020-10-01T09:45:23+05:30 IST

‘రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన నియంత పాలనను తలపిస్తోంది. ఇలాంటి పోకడలున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు’

రాష్ట్రంలో నియంత పాలన

రెవెన్యూ చట్టంపై చర్చకు మేం సిద్ధం

టీపీడీ ఖమ్మం పార్లమెంటరీ కమిటీ సమావేశంలో రాష్ట్ర నేతలు


ఖమ్మం మామిళ్లగూడెం, సెప్టెంబరు 30 : ‘రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన నియంత పాలనను తలపిస్తోంది. ఇలాంటి పోకడలున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు’ అని టీడీపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యుడు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్‌ అన్నారు. బుధవారం ఖమ్మంలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తూ, తనకు నచ్చని శాఖలను మార్చుకుంటూ తుగ్గక్‌ పాలనను తలపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను మాటలతో మభ్యపెడుతున్నారని, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, లక్ష ఉద్యోగాల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ప్రభుత్వం.. పట్టభద్రుల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కుట్రలు పన్నుతోందని, వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.


కొత్త రెవెన్యూచట్టం లోపభూయిష్టంగా ఉందని, ఈ చట్టంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఖమ్మం జిల్లాలో టీడీపీకి కార్యకర్తల బలం చెక్కుచెదరలేదని, పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు ప్రతీ కార్యకర్త కృషిచేయాలన్నారు. పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పదవుల కోసం కాకుండా పార్టీ పటిష్ఠతకు ప్రతీ కార్యకర్త కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రైతుసంఘం రాష్ట్ర నాయకులు కాపా కృష్ణమోహన్‌, సీనియర్‌ నేత డాక్టర్‌ వాసిరెడ్డి రామనాథం, సీనియర్‌ నాయకులు వల్లంకొండ వెంకట్రామయ్య, రాయల లత, ఏన్కూరు ఎంపీపీ ఆరెం వరలక్ష్మి, కొండబాల కరుణాకర్‌, వడ్లమూడి పూర్ణచంద్రరావు, ప్రధాన కార్యదర్శులు గుత్తా సీతయ్య, కేతినేని హరీష్‌, కోపెల శ్యామల, కనగాల అనంతరాములు, ఆనంద్‌కుమార్‌, పార్టీ మండలాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు ఎన్టీఆర్‌, ఇటీవల కన్నుమూసిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, టీడీపీ సీనియర్‌ నాయకులు నూతలపాటి నందమయ్య, ఎల్లంకి మోహన్‌రావు, ఎంపీటీసీ సభ్యుడు వర్సా రవికి నివాళులర్పించారు. 


అనుబంధ సంఘాల నియామకం

టీడీపీ ఖమ్మం పార ్లమెంటరీ కమిటీ అనుబంధ సంఘాలను బుధవారం రాష్ట్ర నాయకులు బక్కని నర్సింహులు, ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు, నెల్లూరి దుర్గాప్రసాద్‌, పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ ్వర్లు ప్రకటించారు. మహిళా అధ్యక్షురాలిగా చెందిన కోపెల శ్యామల(వైరా నియోజకవర్గం), ప్రధాన కార్యదర్శిగా మందపల్లి రజిని (పాలేరు), తెలుగురైతు అధ్యక్షుడిగా నందమూరి సత్యనారాయణ (మధిర), ప్రధాన కార్యదర్శిగా కరుటూరి కృష్ణ (అశ్వారావుపేట), బీసీ సంఘం అధ్యక్షుడిగా గడ్డం ఆదిబాబు (కొత్తగూడెం), ప్రధాన కార్యదర్శిగా పానుగంటి నర్సింహా, తెలుగుయువత అధ్యక్షుడిగా నల్లమల రంజిత్‌ (ఖమ్మం), ప్రధాన కార్యదర్శిగా ఉబ్బని అశోక్‌ (పాలేరు), వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా దారా వెంకటేశ్వరరావు (అశ్వారావుపేట), ప్రధానకార్యదర్శిగా కందిబండ నర్సింహారావు (ఖమ్మం), ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా గద్దల సుబ్బారావు (సత్తుపల్లి), ప్రధాన కార్యదర్శిగా నాగండ్ల మురళి (ఖమ్మం), సాంకేతిక విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆకారపు శ్రీనివాసాచారి (ఖమ్మం), ప్రధాన కార్యదర్శిగా మందపల్లి కోటేశ్వరరావు (పాలేరు), సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా నందిగామ ప్రేమ్‌కుమార్‌ (ఖమ్మం), ప్రధాన కార్యదర్శిగా నూకపోగు వెంకయ్య (పాలేరు), మైనార్టీ సెల్‌ అధ్యక్షునిగా ఎస్కే అక్బర్‌బాషా (ఖమ్మం), ప్రధాన కార్యదర్శిగా ఎన్‌ఏ రహామాన్‌ (కొత్తగూడెం), ఎస్టీసెల్‌ అధ్యక్షుడిగా కటం ఎరప్ప, ప్రధాన కార్యదర్శిగా రూపావతి బాలకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వీరికి రాష్ట్ర, జిల్లా నేతలు అభినందనలు తెలిపారు.

Updated Date - 2020-10-01T09:45:23+05:30 IST