ఎరువుల ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2022-01-23T03:29:34+05:30 IST

ఎరువుల ధరలు తగ్గించాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి జీ. సునీత డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక రైతు కూలీ సంఘం కార్యాలయంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఎరువుల ధరలు తగ్గించాలి
మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి జీ. సునీత

 రైతు కూలీ సంఘం డిమాండ్‌

వెంకటగిరి(టౌన్‌), జనవరి 22: ఎరువుల ధరలు తగ్గించాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి జీ. సునీత డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక రైతు కూలీ సంఘం కార్యాలయంలో జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం రసాయనిక ఎరువుల ధరలను 50 శాతం పెంచిందన్నారు. దీనికితోడు తగినంత సరఫరా లేకపోవడంతో రైతులు యూరియా కోసం దుకాణాల వద్ద నిరీక్షించాల్సి వస్తోందన్నారు. నియోజకవర్గంలో నిమ్మ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి, నిమ్మ ధరలు పడిపోకుండా చూడాలన్నారు.  రైతు పండించే ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. సోమశిల-స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ పూర్తి చేయాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన మినుము, పెసర రైతులకు, పెన్నా పొర్లుకట్టలు తెగి కొట్టుకుపోయిన పొలాల యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం కార్యదర్శి వి.వి. రమణయ్య, కోశాధికారి ఆర్‌ సుబ్బరాయుడు, జీ. కృష్ణారెడ్డి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T03:29:34+05:30 IST