డైస్‌ మీద డైస్‌!

ABN , First Publish Date - 2020-06-16T05:30:00+05:30 IST

ఇంట్లోనే ఆడుకునే ఆట ఇది. శారీరక శ్రమ లేకపోయినా బోలెడు ఫన్‌ లభిస్తుంది. ఈ ఆట ఆడడానికి పాచికలు, ఐస్‌క్రీమ్‌ పుల్లలు ఉంటే సరిపోతుంది...

డైస్‌ మీద డైస్‌!

ఇంట్లోనే ఆడుకునే ఆట ఇది. శారీరక శ్రమ లేకపోయినా బోలెడు ఫన్‌ లభిస్తుంది. ఈ ఆట ఆడడానికి పాచికలు, ఐస్‌క్రీమ్‌ పుల్లలు ఉంటే సరిపోతుంది.


  1. ఆట ఆడే వ్యక్తి ముందుగా నోట్లో ఐస్‌క్రీమ్‌ పుల్ల పెట్టుకోవాలి.
  2. టేబుల్‌పై ఉన్న డైస్‌ను (పాచికలను) ఒక్కొక్కటి పుల్లపై పెట్టాలి. ఒకదానిపై ఒకటి పెట్టాలి.
  3. ఎక్కువ డైస్‌ పెట్టి, ఎక్కువ సమయం కింద పడిపోకుండా ఉన్నవారు గెలిచినట్టు!
  4. ఈ ఆటను టైమ్‌ లిమిట్‌ పెట్టి ఆడుకోవచ్చు. డైస్‌ పడిపోకుండా ఎవరు ఎక్కువ సమయం ఉంచితే వాళ్లే గెలిచినట్టు. లేదంటే ఎవరు ఎక్కువ పాచికలు సమయంలోగా పుల్లపై పెడతారో వాళ్లే గెలిచినట్టుగా ఆడుకోవచ్చు.

Updated Date - 2020-06-16T05:30:00+05:30 IST