గుండాటలో 100 కోట్లు గుల్ల

ABN , First Publish Date - 2021-01-16T06:34:21+05:30 IST

జిల్లాలో ఈసారి కోడిపందేల కన్నా గుండాటదే పైచేయి అయ్యింది.

గుండాటలో 100 కోట్లు గుల్ల

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఈసారి కోడిపందేల కన్నా గుండాటదే పైచేయి అయ్యింది. అధికార పార్టీకి చెందిన గ్రామ స్థాయి నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు దర్జాగా గుండాటలు ఆడించారు. సంక్రాంతి మూడు రోజులు సుమారు రెండు వేలకు పైగా గుండాట బోర్డుల నిర్వాహకులకు మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా వ్యాపారం సాగింది. పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలు, రాజకీయ నాయకుల ఒత్తిడితో స్థానిక పోలీసులు కూడా చూసీచూడనట్టు వదిలేశారు. ఇందుకు గాను నిర్వాహకులు పోలీసు యంత్రాంగానికి రూ.8-10 కోట్లు ముట్టజెప్పిట్టు ఓ అంచనా.  అయితే గుండాట రూపేణా జిల్లాలోని జనం నుంచి రూ.100 కోట్ల వరకు లాగేసినట్టు లెక్క. ప్రతీ ఊళ్లోనూ యువత జేబులు గుల్ల అయ్యాయి. పండుగ రోజు సరదా కాస్తా తీరిపోయింది. అప్పులు చేసి కొందరు, ఇళ్లల్లో పెద్దలను బెదిరించి ఇంకొందరు, దాచుకున్నవి మరొకొందరు...  ఇలా ఏదో ఒకలా డబ్బులు తెచ్చి గుండాటల్లో పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఒకరిద్దరికి డబ్బులు వచ్చి ఉండవచ్చు కానీ నష్టపోయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. 

Updated Date - 2021-01-16T06:34:21+05:30 IST