దిబ్బరొట్టె

ABN , First Publish Date - 2021-05-20T19:37:06+05:30 IST

ముందుగా మినపప్పును నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. బియ్యాన్ని ఓ గంట నానబెట్టి రవ్వలా గ్రైండ్‌ చేసుకోవాలి. రెండిటినీ కలిపి, ఉప్పు వేసి రాత్రంతా పులియబెట్టాలి

దిబ్బరొట్టె

కావలసిన పదార్థాలు: మినపప్పు- 2 కప్పులు, బియ్యం- 4 కప్పులు, నూనె, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా మినపప్పును నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. బియ్యాన్ని ఓ గంట నానబెట్టి రవ్వలా గ్రైండ్‌ చేసుకోవాలి. రెండిటినీ కలిపి, ఉప్పు వేసి రాత్రంతా పులియబెట్టాలి. ఉదయం ఓ మందపాటి పాన్‌లో నూనె వేసి కాగాక మూడు గరిటల పిండిని మందంగా వేసి మూతపెట్టి ఉడికించాలి. రొట్టెను రెండు వైపులా ఎర్రగా కాలనివ్వాలి. దిబ్బరొట్టెను వేడిగా కంటే చల్లగా తింటేనే బాగుంటుంది. బియ్యానికి బదులుగా ఇడ్లీ రవ్వనూ వాడవచ్చు.


Updated Date - 2021-05-20T19:37:06+05:30 IST