వనికెందిన్నెలో డయేరియా

ABN , First Publish Date - 2022-06-30T05:16:07+05:30 IST

శిరివెళ్ల మండలంలోని వనికెందిన్నె గ్రామంలో డయేరియా ప్రబలింది. వర్షాకాలం ప్రారంభమవ్వడంతో ప్రజలు సీజనల్‌గా వచ్చే వాంతులు, విరేచానాల బారిన పడ్డారు.

వనికెందిన్నెలో డయేరియా
యర్రగుంట్ల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులు

  1. పది మంది ఆసుపత్రిపాలు  
  2. తాగునీటి కలుషితమే కారణం 

 శిరివెళ్ల, జూన 29 : శిరివెళ్ల మండలంలోని వనికెందిన్నె గ్రామంలో డయేరియా ప్రబలింది. వర్షాకాలం ప్రారంభమవ్వడంతో ప్రజలు సీజనల్‌గా వచ్చే వాంతులు, విరేచానాల బారిన పడ్డారు. గ్రామంలోని మినీ వాటర్‌ ట్యాంకు, చేతిపంపు నీరు, బోరు నీటిని వాడటం వల్ల డయేరియాకు గురైనట్లు తెలుస్తోంది.   గ్రామానికి చెందిన బాల మద్దిలేటి, రామలక్ష్మమ్మ, లక్ష్మీగౌరి, దీపిక యర్రగుంట్ల ప్రభుత్వ వైద్యశాలలో, శ్రీవిద్య, ఆమె పిల్లలు వైశాలి, నేహ నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో, రవి కుమార్‌, సుబ్బరాయుడు నంద్యాలలోని ఉదయానంద వైద్యశాలలో, నారాయణ కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు యర్రగుంట్ల పీహెచసీ వైద్యాధికారి రంగస్వామి తెలిపారు. మూడు రోజుల నుంచి డయేరియా ప్రభావంలో ఉన్నందు వల్ల గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి  మందులు, ఓఆర్‌ఓస్‌ ప్యాకెట్లు  పంపిణీ చేస్తున్నారన్నారు. కాచి వడపోసిన నీరు మాత్రమే తాగాలని, వాంతులు, విరేచాలనకు గురైతే అశ్రద్ధ చేయకుండా  చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ సాల్మన, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మధుసూదనరెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన అధికారి ప్రభావతి, పంచాయతీ కార్యదర్శి విజయ, వీఆర్వో సుబ్బరామయ్య గ్రామంలో పర్యటించారు. మినీ వాటర్‌ ట్యాంకులు, చేతిపంపులు, కుళాయిల వద్ద  శుభ్రత   లోపించకుండా   చర్యలు చేపట్టారు.

మెరుగైన వైద్య సేవలందించాలి : 

వనికెందిన్నె గ్రామంలో డయేరియాకు గురైన రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన గ్రామంలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన చేయించాలన్నారు.  రోగులు పూర్తిగా కోలుకుని కొత్త కేసులు నమోదుకానంత వరకు వైద్యశిబిరం కొనసాగించాలని ఆదేశించారు.  

 

Updated Date - 2022-06-30T05:16:07+05:30 IST