Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

వజ్రోత్సవ సంబరం

twitter-iconwatsapp-iconfb-icon
వజ్రోత్సవ సంబరంజగ్గయ్యపేట బాలికల హైస్కూల్‌ విద్యార్థులతో సామినేని ఉదయభాను దంపతులు


వజ్రోత్సవ సంబరంజగ్గయ్యపేటలో జెండా వందనం చేస్తున్న తాతయ్య

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం వాడవాడలా వజ్రోత్సవ సంబరాలు అంబరాన్నంటా యి. జాతీయ జెండాలు రెపరెపలాడాయి. వేడుకల్లో ప్ర జా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు..వాడవాడలా త్రివర్ణ పతాక రెపరెపలు

గొల్లపూడి/ జి.కొండూరు/ విస్సన్నపేట/ పెను గంచిప్రోలు/గంపలగూడెం/రెడ్డిగూడెం/ తిరువూరు/జగ్గయ్యపేట/ఇబ్రహీంపట్నం/నందిగామ/చందర్లపాడు/ఎ.కొండూరు/మైలవరం/వత్సవాయి/నందిగామరూరల్‌/వీరులపాడు/కంచికచర్ల రూరల్‌, ఆగస్టు 15: జి.కొండూరు వివేకానంద హైస్కూల్లో ఎంపీపీ వి.లక్ష్మీతిరుపతమ్మ, పాల కేంద్రంలో అధ్యక్షుడు పజ్జూరు నరసింహారావు, చిన్న నందిగామలో సర్పంచ్‌ ధనేకుల శ్రీకాంత్‌, కుంటముక్కలలో టీడీపీ ఆధ్వ ర్యంలో ఎంపీటీసీ జయలక్ష్మి జాతీయ జెండాలు ఆవిష్కరించారు. గడ్డమణుగులో నూతక్కి అపర్ణ విద్యా ర్థులకు నోటు పుస్తకాలు, మిఠాయిలు పంచారు. కవ లూరులో క్రాంతి హైస్కూల్‌ విద్యార్థులు మహనీయు ల వేషధారణలో చేసిన ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. కవులూరు పీఏసీఎస్‌లో చైర్మన్‌ ఓంకారబాబు, పం చాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ మరియమ్మ, గొల్లపూడి అంబేడ్కర్‌ విద్యా అకాడమీలో సీటీవో ఎం.సుబ్రహ్మణ్యం జాతీయ జెండాలు ఆవిష్కరిం చారు. కరస్పాండెంట్‌ ఆర్‌.సత్యనారాయణ పాల్గొ న్నారు. బొడ్డురాయి సెంటర్‌, మైలరాయి సెంటర్‌, జక్కంపూడిలో బొమ్మసాని సుబ్బారావు, మౌలానగర్‌లో టీడీపీ మైనార్టీ సెల్‌ నాయకుడు షేక్‌ కరీముల్లా, గొల్లపూడి పంచాయతీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్‌ కారంపూడి సురేష్‌, రాయనపాడులో సర్పంచ్‌ కాటం నేని కల్యాణి, మాజీ ఎంపీపీ కాటంనేని పూర్ణచంద్ర రావు, విస్సన్నపేటలో కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షుడు చలసాని వెంకటేశ్వరరావు తదితరులు.. ఎంపీపీ పి.మెర్సీ వనజాక్షి, తహసీల్దార్‌ కె.లక్ష్మి, ఎస్సై పి.కిషోర్‌లు వారి కార్యాలయాల్లో, పెను గంచిప్రోలులో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఎన్‌ఎస్‌పీ డీసీ మాజీ చైర్మన్‌ వేగినేని గోపాలకృష్ణమూర్తి జాతీయ జెం డాలు ఆవిష్కరించారు. చింతల వెంకట సీతారామ య్య, చిల్లేపల్లి సుధీర్‌బాబు పాల్గొన్నారు. పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఏఎస్సై సర్వేశ్వరరావు, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద, పీహెచ్‌సీల వద్ద ఎంపీపీ మార్క పూడి గాంధీ జాతీయ జెండాలు ఆవిష్కరించారు. జడ్పీ టీసీ సభ్యురాలు ఊట్ల నాగమణి, పీహెచ్‌సీ డాక్టర్‌ ఇం దిర పాల్గొన్నారు. తిరుపతమ్మ దేవస్థానం వద్ద చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావు జెండా ఆవిష్కరణ చేశారు. ధర్మకర్తలు, ఏఈవో తిరుమలేశ్వరరావు పాల్గొన్నారు. గంపలగూడెం మండల పరిషత్‌ కార్యాలయంలో, ఎమ్మార్సీ భవనం వద్ద ఎంపీపీ గోగులమూడి శ్రీలక్ష్మి, జడ్పీ హైస్కూల్లో పీఎమ్‌సీ చైర్మన్‌ కోట మరియమ్మ, పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ కోట పుల్లమ్మ జాతీయ జెండాలు ఆవిష్కరించారు. తహసీల్దార్‌ జి.బాలకృష్ణారెడ్డి, ఎంఈవో సోమశేఖర్‌ నాయక్‌, ఎస్సై వి.సతీష్‌ పాల్గొన్నారు.  రెడ్డిగూడెం మండలం పాత నాగులూరులో టీడీపీ నేతలు ముప్పిడి నాగేశ్వరరెడ్డి, డేవిడ్‌, నరసయ్య, గొలుసు చిన్ని జెండా ఆవిష్కరిం చారు. ఎంపీపీ రామినేని దేవి ప్రవణ్య, జడ్పీటీసీ సభ్యు డు పాలంకి విజయభాస్కర రెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాసరెడ్డి, ఎస్సై డి.ఆనంద్‌కుమార్‌, తహసీ ల్దార్‌ పాల్‌, ఎస్‌బీఐ మేనేజర్‌ ప్రదీప్‌కుమార్‌, వికాస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాకారపు శ్రీనివాసరావు, గీతాంజలి హైస్కూల్లో కోటేరు కోటిరెడ్డి జాతీయ జెండాలను ఆవి ష్కరించారు.    


వజ్రోత్సవ సంబరంనందిగామలో జగన్మోహన్‌రావు

తిరువూరులో..

ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం వద్ద, జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, కోర్టులో జడ్జి శివకిరణ్‌, రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది, మండల పరిషత్‌లో ఎంపీడీవో పీవీఎస్‌ నాగేశ్వరరావు, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై దుర్గాప్రసాద్‌, వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏవో పద్మ, లక్ష్మీపురం పాలశీతల కేంద్రంలో మేనేజర్‌ టి.సాంబశివమూర్తి, ఐసీడీఎస్‌ కార్యాలయంలో సీడీపీవో సత్యవతి, మున్సిపల్‌, గ్రంథాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి, వెంకటరమణ, పట్టణ లయన్స్‌ క్లబ్‌ కార్యాలయంలో అధ్యక్షురాలు రామసీత జాతీయ జెం డాలను ఆవిష్కరించారు. పంచాయతీరాజ్‌, హౌసింగ్‌, ఇరిగేషన్‌, ఆర్‌డబ్య్లూఎస్‌ కార్యాలయాలు, ఆర్టీసీ, వైద్యశాలలో ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాలు అవిష్కరించారు, టీడీపీ నియోజకవర్గ, పట్టణ పార్టీ కార్యాలయాల్లో శావల దేవదత్‌, బొమ్మసాని మహేష్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో షేక్‌ కమృద్దీన్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ మం డల కమిటీ ఆధ్వర్యంలో తిరువూరులో 75 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. 


వజ్రోత్సవ సంబరం నందిగామలో సౌమ్య ర్యాలీ

ఎన్టీటీపీఎస్‌లో.. 

ఎన్టీటీపీఎస్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చీఫ్‌ ఇంజనీర్‌ నవీన్‌గౌతమ్‌, ఎన్టీటీపీఎస్‌ పరిపాలనా భవన సము దాయంలో చీఫ్‌ ఇంజనీర్‌ అశోక్‌కుమార్‌రెడ్డి జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. టీడీపీ కొండపల్లి మున్సి పాలిటీ ఆధ్వర్యంలో స్టేషన్‌ సెంటర్‌ నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. రామినేని రాజశేఖర్‌, చుట్టుకుదురు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అప్మెల్‌ కంపెనీలో సీఎఫ్‌వో వై.శ్రీనివాసరావు, కొండపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ పి.శ్రీధర్‌, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కొండపల్లి ఆరుపంపుల సెం టర్‌లో బొర్రా కిరణ్‌, రింగ్‌ సెంటర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో రేగళ్ల రఘు నాథరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. క్యాపో సోసైటీ ఆధ్వర్యంలో దయా జాతీ య జెండాతో కొండపల్లిలో ప్రదర్శన నిర్వహించారు. సీఐటీయూ నాయకులు ఎన్‌సీహెచ్‌ శ్రీనివాస్‌, ఎం.మహేష్‌ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. 

జగ్గయ్యపేటలో..

 ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, వైసీపీ కార్యాలయం వద్ద, ఎస్జీఎస్‌ కళాశాల వద్ద మునిసిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర, చౌడవరపు జగదీష్‌, బంగారపుకొట్ల సెంటర్‌ గాంధీ విగ్రహం, అన్న క్యాంటీన్‌తో పాటు పట్టణంలోని సెంటర్లలో శ్రీరాం తాతయ్య జాతీయ జెం డాలను ఆవిష్కరించారు. శ్రీరాం సుబ్బారావు, ఆచంట సునీత పాల్గొన్నారు. 5వ వార్డు సచివాలయంలో  చైర్మన్‌ రాఘవేంద్ర, కౌన్సిలర్‌ రామలక్ష్మి, సీపీఐ కార్యా లయం వద్ద శ్రీనివాసరావు, ఆర్టీసీ డిపోలో డీఎం ఎమ్వీ ప్రసాద్‌, చేగు విద్యాలయంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు తాడేపల్లి సోమేశ్వరరావు, పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కాకరపర్తి సోమేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘ కార్యాలయం వద్ద శివప్రసాద్‌, ఆర్‌ అండ్‌ బీ కార్యాలయం వద్ద జేఈ నరేంద్ర, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై బీవీ రామారావు, మండవ కళాశాల వద్ద వైస్‌ ప్రిన్సిపాల్‌ బట్టు హనుమంతురావు,  లిటిల్‌ ఏంజిల్స్‌ హైస్కూల్‌ వద్ద పి.ప్రసాద్‌, విజ్ఞాన్‌ హైస్కూల్‌ వద్ద తన్నీరు సుధారాణి, జేఆర్సీ కళాశాల వద్ద రంగా పురం నరసింహారావు, ఎస్జీఎస్‌ కళాశాల వద్ద చింతా శేషానందం, డాక్టర్‌ జీడీవీ ప్రసాద్‌ జెండావిష్కరణ చేశారు. పట్టణంలోని బాలాజీ ఆపార్ట్‌మెంట్స్‌ వద్ద మాజీ సైనికులు బలగం సింగురాజు, వీర్ల శ్రీనివాస్‌ను ఆపార్ట్‌మెంట్‌ కమిటీ అభినందించింది. మహాలక్ష్మీ అమ్మవారి వెండి దేవాలయం వద్ద చైర్మన్‌ అత్తులూరి వెంకటేశ్వర్లు, పుష్పావతి దంపతులు త్రివర్ణపతాక రంగుల చీరలు ధరించిన మహిళా కమిటీ సభ్యులతో జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. సిటీ సెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. 

నందిగామలో..

ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఆర్డీవో రవీంద్రరావు, ఏసీపీ నాగేశ్వరరెడ్డితో పాటు అధికారులు వజ్రోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. కంచికచర్ల మం డలం మున్నలూరు టీడీపీ నాయకులు అన్న క్యాంటీన్‌ నిర్వహణకు 31,500 రూపాయలు, క్వింటాన్నర బియ్యం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు అంద జేశారు. చందర్లపాడు టీడీపీ కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నాయకుడు కోట వీరబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

ఎ.కొండూరులో..

 ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కె. నాగలక్ష్మి, తహ సీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ వెంకటేశ్వరావు, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై అంకారావు, పీహెచ్‌సీలో డాక్టర్‌ దివిజ, క్రాంతి పథం కార్యాలయంలో ఏపీఎం సత్యం,  కంభంపాడు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దూప గుంట్ల పుల్లారావు, రమేష్‌బాబు, సురేష్‌, శ్రీనివాసరావు జాతీయ జెండాలు ఆవిష్కరించారు.

మైలవరంలో..

 75 అడుగుల జాతీయ పతాకంతో నూజివీడు రోడ్డు బైపాస్‌(ఫారెస్టు ఆఫీస్‌) నుంచి పట్టణ ప్రధాన రహదారి వెంబడి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహిం చారు. టీడీపీ పట్టణ కార్యాలయంలో జాతీయ జెం డాను ఎగరవేశారు. పురవీధుల్లో లంక లితీష్‌ యూత్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 

వత్సవాయిలో..

కన్యకా పరమేశ్వరి అమ్మవారిని భరతమాతగా అల ంకరించి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానాన్ని త్రివర్ణ పతాకాలు, త్రివర్ణాల తోరణాలతో ప్రత్యేకంగా అలంక రించారు. అమ్మవారి చేతిలో జాతీయజెండాను ఉంచా రు. ఐకేపీ భవనం వద్ద మండల సమైక్య అధ్యక్షురాలు కందుల త్రివేణి, వత్సవాయి పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్సై మహాలక్ష్ముడు, సీపీఎం కార్యాలయం వద్ద గింజుపల్లి ల క్ష్మయ్య, పీహెచ్‌సీ వద్ద జడ్పీటీసీ దేవమణి జెండాలను ఆవిష్కరించారు. 

నందిగామ మండలంలో..

 మాజీ సైనికుల భవనంలో ఢిల్లీకి చెందిన సహకార భారతి సంఘం ప్రతినిధి రేవతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల వాసవీ క్లబ్‌, వాసవీ సిల్వర్‌ స్టార్‌ క్లబ్‌ల ఆధ్వర్యంలో విశ్రాంత సైనికులను సత్క రించారు. కాకతీయ విద్యా సంస్థల అధినేత సమాజ సే వలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే హుసేన్‌రావు, రామిరెడ్డి శ్రీధర్‌, ఆరోగ్యనాథ్‌, తుర్లపాటి కోటేశ్వరరావు ను సత్కరించారు. 

వీరులపాడులో..

 తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అధికారులు, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సోమేశ్వరరావు, జుజ్జూరు ప్రెస్‌క్లబ్‌ వ ద్ద ప్రతినిధులు జెండాను ఎగరవేశారు. ఎంపీపీ కోటేరు లక్ష్మీ, ఎంపీడీవో అరుంధతీదేవి పాల్గొన్నారు. 

కంచికచర్ల మండలంలో..

 ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంఘ కార్యాలయం వద్ద అధ్యక్షుడు సానె రామ్మెహనరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.