భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-12T06:16:39+05:30 IST

భావి తరాలకు జాతీయ స్ఫూర్తిచ్చేలా స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్నామని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. మున్సిపల్‌, పోలీస్‌, విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల పట్టణం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఫ్రీడమ్‌ రన్‌ను జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణితో కలిసి ప్రారంభించారు.

భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా వజ్రోత్సవాలు
ఫ్రీడమ్‌ రన్‌ ప్రారంభిస్తున్న కలెక్టర్‌, జడ్పీ చైర్‌ పర్సన్‌, ఎస్పీ

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 11: భావి తరాలకు జాతీయ స్ఫూర్తిచ్చేలా స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్నామని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. మున్సిపల్‌, పోలీస్‌, విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల పట్టణం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఫ్రీడమ్‌ రన్‌ను జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణితో కలిసి ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణం అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఫ్రీడమ్‌రన్‌ బతకమ్మ ఘాట్‌ వరకు సాగింది. అనంతరం బతకమ్మ ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో  కలెక్టర్‌ అనురాగ్‌  జయంతి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి  75 ఏళ్ల మైలు రాయిని దాటడం దేశ చరిత్రలో  గొప్ప ఘట్టంగా నిలుస్తుందన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా ప్రజల్లో దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని నింపేలా ప్రభుత్వం ఈ నెల 22 వరకు ప్రత్యేక కార్యక్రమాలను  నిర్వహిస్తోందన్నారు.  దేశంలో సగానికి పైగా ఉన్న యువతను వేడుకల్లో భాగస్వామ్యం చేయడం వ్యాయామం, ఆరోగ్య ప్రధాన్యం తెలియజేయడం కోసం ఫ్రీడమ్‌ రన్‌ను చేపట్టినట్లు చెప్పారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కళాచక్రపాణి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలు, పోరాటల ఫలితంగా  దేశానికి స్వాతంత్య్రం వచ్చిం దన్నారు. భావితరాలకు స్వాతంత్య్ర సమరయోధుల సూర్తిని తెలియ జేస్తూ, వారి ఆశయా సాధనకు ప్రతి ఒక్కరినీ ప్రేరేపించడం వజ్రో త్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు నిర్వహించే  వేడుకల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వా ములు కాలన్నారు.  జిల్లా విద్యాధికారి, విద్యార్థులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, యువకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌, ఆదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కమిషనర్‌ సమ్మయ్య, యువజన క్రీడా అధికారి ఉపేందర్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం, తహసీల్దార్‌ విజయ్‌ కుమార్‌, డీపీఆర్వో మామిండ్ల దశరథం, టీపీవో అన్సార్‌, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T06:16:39+05:30 IST