ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తి నింపేందుకే వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-14T04:07:03+05:30 IST

ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తి నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం ఏఎంసీ మైదానం లో నిర్వహించిన వజ్రోత్సవాల్లో మాట్లాడారు. స్వాతంత్య్రం కోసం ఎంతో మంది వీరులు పోరాటాలు చేశారని, మహానీ యులను స్మరించుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర వజ్రోత్స వాలను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తి నింపేందుకే వజ్రోత్సవాలు
బెల్లంపల్లిలో జాతీయ జెండాలతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ వెంకటేష్‌, ఎమ్మెల్యే చిన్నయ్య

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

బెల్లంపల్లి, ఆగస్టు 13: ప్రతీ ఒక్కరిలో స్ఫూర్తి నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం ఏఎంసీ మైదానం లో నిర్వహించిన వజ్రోత్సవాల్లో మాట్లాడారు. స్వాతంత్య్రం కోసం ఎంతో మంది వీరులు పోరాటాలు చేశారని, మహానీ యులను స్మరించుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర వజ్రోత్స వాలను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఏఎంసీ మైదానం నుంచి  120 మీటర్ల జాతీయ పతాకంతో తిలక్‌ స్టేడియం వరకు 25 వేల మందితో ఫ్రీడమ్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తిలక్‌ స్టేడియంలో సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 25 వేల మందితో సామూహిక జాతీయ గీతాలాపన, జాతీయ జెండాతో ర్యాలీకి ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో నమోదు చేశారు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు కో ఆర్డినేటర్‌ రంగ జ్యోతి చేతుల మీదుగా ఇన్‌చార్జి డీసీపీ అఖిల్‌ మహాజన్‌, ఏసీపీ ఎడ్ల మహే ష్‌ పోలీసు అధికారులతో కలిసి అవార్డును అందుకున్నారు. ఎంపీ వెంకటేష్‌నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కలెక్టర్‌ భారతి హోళికేరి, డీఎఫ్‌వో శివానీ, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రవీణ్‌, ఆర్డీవో శ్యామలాదేవి, ఏసీపీ ఎడ్ల మహేష్‌, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

ఏసీసీ: వీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక ్టర్‌ భారతి హోళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలో 75వ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని కలెక్టర్‌, ఇన్‌చార్జి డీసీపీ అఖిల్‌ మహజన్‌, డీఎఫ్‌వో శివాణిడోంగ్రే, ఎమ్మెల్యే దివాకర్‌రావులు ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వ హించారు. ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా మీదుగా బాలుర హాస్టల్‌ గ్రౌండ్‌ వరకు కొనసాగింది. వందేమాతరం, భార త్‌ మాతాకీ జై, జై హింద్‌ అంటూ నినాదాలు చేశారు. సుమారు 15 వేల మంది వరకు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ సమైఖ్యత, సమగ్రత కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో మహనీయులు చూపిన ధైర్య సాహసాలు, పోరాట పటిమ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహా త్మా గాంధీ ఆశయ సాధనకు ఆయన అడుగుజాడల్లో నడవా లన్నారు. ఏసీపీ తిరుపతిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజ య్య, కమిషనర్‌ బాలకృష్ణ, సీఐ నారాయణ, డీవైఎస్‌వో శ్రీకాం త్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌, విజిత్‌రావు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.   

Updated Date - 2022-08-14T04:07:03+05:30 IST