ఎవరికి ఏ కష్టం వచ్చినా.. 100కు ఫోన్‌ చేస్తే ఆరు నిమిషాల్లో మీ ముందుకు..

ABN , First Publish Date - 2022-01-06T14:25:22+05:30 IST

ఎవరికి ఏ కష్టం వచ్చినా.. డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే చాలు.. నిమిషాల్లో స్పందిస్తున్నారు పోలీసులు...

ఎవరికి ఏ కష్టం వచ్చినా.. 100కు ఫోన్‌ చేస్తే ఆరు నిమిషాల్లో మీ ముందుకు..

  • ట్రై కమిషనరేట్‌లో గతేడాది..
  • 5.56 లక్షల కాల్స్‌ చేసిన బాధితులు
  • వేగంగా స్పందిస్తున్న పోలీసులు 

హైదరాబాద్‌ సిటీ : ఎవరికి ఏ కష్టం వచ్చినా.. డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే చాలు.. నిమిషాల్లో స్పందిస్తున్నారు పోలీసులు. ఆపద ఎలాంటిదైనా డయల్‌-100కు ఫోన్‌ చేయాలని పోలీసులు విస్తృత ప్రచారం చేస్తుండడంతో ఆ నెంబర్‌కు ఆదరణ పెరుగుతోంది. గతేడాది ట్రై కమిషనరేట్‌ పరిధిలో 5.56 లక్షల మంది బాధితులు డయల్‌-100కు ఫోన్‌ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజల నుంచే వచ్చే కాల్స్‌ ఆధారంగా క్విక్‌గా రెస్పాండ్‌ అయ్యేలా పెట్రోలింగ్‌ కార్లు, బ్లూకోల్ట్స్‌ సిబ్బందిని ఎక్కువగా ఏర్పాటు చేశారు. డయల్‌ - 100కు కాల్‌ చేస్తే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్న సరాసరి సమయం ఆరు నిమిషాలుగా ఉంటోంది. డయల్‌ - 100కు వచ్చిన సమాచారం ఆధారంగా వివిధ కారణా లతో 63 మందిని  రాచకొండ పోలీసులు కాపాడారు.


ఆయా కమిషనరేట్లలో డయల్‌-100 వినియోగించుకున్న వారు.. 

రాచకొండ - 1,72,462

సైబరాబాద్‌ - 1,84,473

హైదరాబాద్‌ సిటీ - 1,99,873

మొత్తం : 5,56,808

Updated Date - 2022-01-06T14:25:22+05:30 IST