Dia Mirza బాలీవుడ్ నటి, తెలుగులో ఇటీవల ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటించిన దియామీర్జా ప్రస్తుతం గర్భిణిగా ఉంది. ఈ సమయాన్ని ఆహ్లాదకరంగా గడిపేందుకు ఆమె తన భర్త వైభవ్ రెఖీ, కుమార్తె సమాయరాలతో పాటు మాల్దీవులలో ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలలో దియా మీర్జా ఎంతో ఉల్లాసంగా కనిపిస్తోంది. ఒక పడవలో ప్రయాణిస్తూ దియా ఎంజాయ్ చేస్తోంది. భర్త, కుమార్తె కూడా ఈ ఫొటోలలో కనిపిస్తున్నారు. తాము అమూల్యమైన, మ్యాజికల్ కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నామని ఆ ఫొటోలకు ట్యాగ్ చేసింది. కాగా గత ఏప్రిల్లో తాను ప్రెగ్నెంట్నని దియా మీడియాకు తెలిపారు.