ధోతీ ధమాల్‌!

ABN , First Publish Date - 2020-03-20T05:49:04+05:30 IST

కుర్తీ అడుగున ధరించే ప్యాంట్‌ వెరైటీగా ఉంటేనే డ్రెస్‌ మొత్తానికి అందం చేకూరుతుంది. ఇందుకోసం బోలెడన్ని రకాల ప్యాంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే...

ధోతీ ధమాల్‌!

కుర్తీ అడుగున ధరించే ప్యాంట్‌ వెరైటీగా ఉంటేనే డ్రెస్‌ మొత్తానికి అందం చేకూరుతుంది. ఇందుకోసం బోలెడన్ని రకాల ప్యాంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటిలో ‘ధోతీ ప్యాంట్‌’ తాజా ఫ్యాషన్‌ ట్రెండ్‌గా మారింది. మరి మీరూ ట్రెండ్‌కు తగ్గట్టు ఇవే ప్యాంట్లను ఎంచుకోండి!


కుర్తీ పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా... స్లీవ్స్‌ ఉన్నా, లేకున్నా ధోతీ ప్యాంట్‌ చక్కగా సూటవుతుంది. వీటిలో ప్లెయిన్‌వే ధరించాలనే రూలేం లేదు. డిజైన్‌ ఉన్నవీ ఎంచుకోవచ్చు.


అనార్కలి, అంబెరిల్లా, స్ట్రెయిట్‌.... మోడల్‌ ఏదైనా కుర్తీకి కొత్త రూపం తేవాలంటే ధోతీ ప్యాంట్‌ ఎంచుకోవాలి. అయితే ఈ ప్యాంట్‌ ఎంచుకునేటప్పుడు యాంకిల్‌ లెంగ్త్‌ ఉండేలా చూసుకోవాలి. కురచగా ఉంటేనే ఈ తరహా ప్యాంట్లు అందంగా కనిపిస్తాయి.


క్యాజువల్‌ వేర్‌గా ధరించదగిన ఈ ప్యాంట్లకు శాండిల్స్‌, ఫ్లాట్స్‌ చక్కగా సూటవుతాయి. డ్రెస్‌, సందర్భాలను బట్టి హై హీల్స్‌ కూడా ధరించవచ్చు. 

Updated Date - 2020-03-20T05:49:04+05:30 IST