Abn logo
Oct 17 2020 @ 19:12PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

Kaakateeya

షార్జా: ఢిల్లీ కేపిటల్స్‌తో జరగనున్న ఐపీఎల్ 34వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వికెట్ ఫ్రెష్‌గా కనిపిస్తుండడం, పచ్చిక లేకపోవడంతో బ్యాటింగ్ ఎంచుకున్నట్టు ధోనీ చెప్పాడు. గత మ్యాచ్‌లో ఎక్కువగా తప్పులు చేయలేదని, ఈ మ్యాచ్‌లోనూ అలాగే ఆడతామని పేర్కొన్నాడు. పీయూష్ చావ్లా స్థానంలో కేదార్ జాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు. ఢిల్లీ జట్టు గాయపడిన పంత్‌కు ఈ మ్యాచ్‌లోనూ విశ్రాంతి ఇచ్చింది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్టు ఢిల్లీ సారథి శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నాడు. 

Advertisement
Advertisement
Advertisement