నేను కెప్టెన్ అవడంలో.. ధోనీ పాత్ర చాలా ఉంది: కోహ్లీ

ABN , First Publish Date - 2020-06-01T04:55:30+05:30 IST

తాను టీమిండియా కెప్టెన్ అవడంలో మాజీ సారధి ధోనీ పాత్ర చాలా ఉందని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు.

నేను కెప్టెన్ అవడంలో.. ధోనీ పాత్ర చాలా ఉంది: కోహ్లీ

న్యూఢిల్లీ: తాను టీమిండియా కెప్టెన్ అవడంలో మాజీ సారధి ధోనీ పాత్ర చాలా ఉందని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో యూట్యూబ్ లైవ్ సెషన్ సందర్భంగా కోహ్లీ ఈ విషయాలు వెల్లడించాడు. అంతర్జాతీయ కెప్టెన్ ఎలా ఆలోచించాలో ధోనీ వల్లే తనకు అర్థమైందని తెలిపాడు. ‘నేనెప్పుడూ ధోనీ పక్కనే నిలబడేవాడిని. ధోనీ నాతో చాలా విషయాలు చర్చించేవాడు. దానివల్లే తన తర్వాత నేను కెప్టెన్ అవగలనని ధోనీ నమ్మాడు’ అని కోహ్లీ చెప్పాడు. అటువంటి నమ్మకం ఒక్కరోజులో రాదని, మనమే కష్టపడి సంపాదించుకోవాలని సూచించాడు.

Updated Date - 2020-06-01T04:55:30+05:30 IST