ముంబై: ఐపీఎల్ ప్రారంభానికి రెండు రోజుల ముందు చెన్నై జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్రసింగ్ ధోనీ ఆ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు. సారథ్య బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్నప్పటికీ జట్టు ఇంకా అతడి నియంత్రణలోనే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన చెన్నై ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ఫ్రాంచైజీ లీడర్ షిప్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్లు అజయ్ జడేజా, పృథ్వీపాటిల్ తీవ్ర విమర్శలు చేశారు. ధోనీ ఇంకా జట్టును నియంత్రిస్తున్నాడని, ఇదంత మంచిది కాదని ‘క్రిక్బజ్’తో మాట్లాడుతూ అన్నారు.
నిజానికి ధోనీ లాంటి కెప్టెన్ లేడని, రాబోడని పేర్కొన్నారు. సారథ్య బాధ్యతల నుంచి వైదొలగడం అతడి ఇష్టమని అన్నారు. అయితే, రవీంద్ర జడేజాను ప్రోత్సహించి ముందుకు నెట్టడానికి తోడు వెనక్కి లాగారని, అది ఆత్మవిశ్వాసం సన్నిగిల్లేలా చేసిందన్నారు. అధికారికంగా జడేజా చెన్నై కెప్టెన్ అయినప్పటికీ జట్టుకు అతడు పూర్తి బాధ్యత వహించకుండా సీఎస్కే లీడర్ షిప్ అడ్డుకుంటున్నట్టుగా ఉందని విమర్శించారు.
ఇవి కూడా చదవండి