ధోనీ బుర్ర అమోఘం!

ABN , First Publish Date - 2022-01-27T06:42:27+05:30 IST

క్రికెట్‌లో అతి చురుకైన బుర్ర ఉన్న వాళ్లలో ధోనీ ఒకడని టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ కొనియాడాడు.

ధోనీ బుర్ర అమోఘం!

మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌

న్యూఢిల్లీ: క్రికెట్‌లో అతి చురుకైన బుర్ర ఉన్న వాళ్లలో ధోనీ ఒకడని టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ కొనియాడాడు. మహీ నిర్ణయాధికారం.. అతడి సమకాలీన మేటి ఆటగాళ్లతో పోల్చితే ఎంతో ప్రత్యేకమని అన్నాడు. ప్రస్తుత కోచింగ్‌ విధానాలను చాపెల్‌ తప్పుబట్టాడు. భారత్‌లో సహజంగా కనిపించే గల్లీ క్రికెట్‌ సంస్కృతి.. విదేశాల్లో లోపించడం వల్లే మంచి ఆటగాళ్లు తయారు కాలేకపోవడానికి ఒక కారణంగా గ్రెగ్‌ చెప్పాడు. గత తరంలో గొప్ప క్రికెటర్లు వెలుగు చూశారంటే.. ప్రకృతి నుంచి నేర్చుకోవడం వల్లేనన్నాడు. ‘భారత ఉపఖండంలో ఇప్పటికీ కొన్ని పట్టణాల్లో కోచింగ్‌ సౌకర్యాలు అరుదు. కుర్రాళ్లు గల్లీల్లో, ఖాళీస్థలాల్లో ఎలాంటి కోచింగ్‌ లేకుం డా ఆడతారు. అలాగే ఎంతోమంది ఎదిగారు. వారిలో ధోనీ కూ డా ఒకడు. తనకంటే ఎక్కువ అనుభవం, భిన్నమైన ప్రాంతాల్లో ఆడడం వల్ల అతడు ఎంతో నేర్చుకున్నాడు. ఆటలో చురుగ్గా నిర్ణయాలు తీసుకొనే పరిజ్ఞానం.. సమకాలీనులతో పోల్చితే అతడిని ఎంతో భిన్నంగా చూపిస్తోంద’ని చాపెల్‌ ప్రశంసించాడు. 

Updated Date - 2022-01-27T06:42:27+05:30 IST