ఫిర్యాదుల అనంతరం పంచనామా

ABN , First Publish Date - 2021-05-17T05:16:57+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాలకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా అందజేసే పాలప్యాకెట్లు గడువు తీరిన తర్వాత మిగిలిన ప్యాకెట్లను పంచనానా నిర్వహించాల్సి ఉంటుంది.

ఫిర్యాదుల అనంతరం పంచనామా

  1. గడువు తీరిన పాల ప్యాకెట్లను దహనం చేసిన అధికారులు


డోన్‌(రూరల్‌), మే 16: అంగన్‌వాడీ కేంద్రాలకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకంలో భాగంగా అందజేసే పాలప్యాకెట్లు గడువు తీరిన తర్వాత మిగిలిన ప్యాకెట్లను పంచనానా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే డోన్‌లో ఓ  కాంట్రాక్టర్‌ గడువు తీరిన దాదాపు 300 పాల ప్యాకెట్లు మండలంలోని డోన్‌ ఎర్రగుంట్ల ప్రధాన రోడ్డు సమీప ముళ్లకంపల్లో కుప్పలుగా పారేశారు. దీనిపై పలువురి నుంచి ఫిర్యాదులు అందడంతో ఐసీడీఎస్‌ సీడీపీవో అనూరాధ ఆదేశాల మేరకు సూపర్‌వైజర్‌ పద్మావతి, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుగుణమ్మ, నియోజకవర్గ కార్యదర్శి చాందిని పాలప్యాకెట్లు పారవేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వాటికి నిప్పు పెట్టి కాల్చివేసి పంచనామా నిర్వహించారు. 

Updated Date - 2021-05-17T05:16:57+05:30 IST