‘కర్నూలు జిల్లా నుంచి డోన్‌ను విడదీయొద్దు’

ABN , First Publish Date - 2022-01-31T01:08:10+05:30 IST

ఇప్పటికే డోన్‌ నియోజకవర్గం కరువు ప్రాంతమని, జిల్లాల విభజన పేరుతో ప్రజలకు అన్యాయం చేయవద్దని వివిధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

‘కర్నూలు జిల్లా నుంచి డోన్‌ను విడదీయొద్దు’

డోన్‌: ఇప్పటికే డోన్‌ నియోజకవర్గం కరువు ప్రాంతమని, జిల్లాల విభజన పేరుతో ప్రజలకు అన్యాయం చేయవద్దని వివిధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. డోన్‌ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని రెండో రోజూ ఆదివారం పట్టణంలోని పాతబస్టాండులో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో పాటు బీఎస్‌పీ నాయకులు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ మాట్లాడుతూ డోన్‌ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో ఉండడం వల్ల ప్రజలకు ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. నంద్యాల జిల్లాలోకి కలపడం వల్ల డోన్‌ నియోజకవర్గానికి నష్టమే తప్ప.. ఎలాంటి మేలు జరగదన్నారు. ఐఎఫ్‌టీయు నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోకి కలిపితే.. డోన్‌ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎన్నో సౌకర్యాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు. రైతులు పంట ఉత్పత్తులు అమ్ముకోవాలంటే.. చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. డోన్‌ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

Updated Date - 2022-01-31T01:08:10+05:30 IST