ధవన్ అవుట్.. ఇక పాండ్యాపైనే అంతా..!

ABN , First Publish Date - 2020-11-27T22:27:50+05:30 IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఇప్పటివరకు నిలకడగా ఆడిన ధవన్ 86 బంతుల్లో...

ధవన్ అవుట్.. ఇక పాండ్యాపైనే అంతా..!

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఇప్పటివరకు నిలకడగా ఆడిన ధవన్ 86 బంతుల్లో 74 కొట్టి అవుటయ్యాడు. జంపా బౌలింగ్‌లో క్రీజ్ వదిలి ముందుకొచ్చి షాట్ ఆడబోయిన ధవన్ లాంగాన్‌లో ఉన్న స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక భారం మొత్తం పాండ్యాపైనే ఉంది. పాండ్యాతో పాటు ఇప్పుడు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. మరి వీరిద్దరూ మ్యాచ్ గెలిపిస్తారో లేదో వేచి చూడాలి. మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ ఇంకా 72 బంతుల్లో 129 పరుగులు చేయాల్సి ఉంది.


ఇదిలా ఉంటే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు. 75 బంతుల్లోనే 4 సిక్సర్లు, 7 ఫోర్లతో హార్దిక్ 90 పరుగులు పూర్తి చేశాడు. 101 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్‌ను ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ధవన్ అవుట్ కావడంతో ఇప్పుడు జడేజాతో ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు.

Updated Date - 2020-11-27T22:27:50+05:30 IST