floods: గోదావరి తగ్గుముఖం

ABN , First Publish Date - 2022-08-20T01:25:12+05:30 IST

తూర్పుగోదావరిజిల్లా ధవళేశ్వరం (Dhavaleswaram) వద్ద గతవారం రోజులుగా పెరుగుతున్న గోదావరి (Godavari) తగ్గుముఖం పడుతోంది.

floods: గోదావరి తగ్గుముఖం

ధవళేశ్వరం: తూర్పుగోదావరిజిల్లా ధవళేశ్వరం (Dhavaleswaram) వద్ద గతవారం రోజులుగా పెరుగుతున్న గోదావరి (Godavari) తగ్గుముఖం పడుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు 15.80 అడుగుల వద్ద నిలకడగా కొనసాగిన నీటిమట్టం ఆపై తగ్గుముఖం పట్టింది. 4గంటల వ్యవధిలో ఒక్క పాయింట్‌ చొప్పున తగ్గిన నీటిమట్టం శుక్రవారం ఉదయం 7గంటలకు 15.60 అడుగులకు చేరుకోగా సాయంత్రానికి క్రమంగా తగ్గుతూ 15.10అడుగులకు చేరుకుంది. ఈ సమయంలో బ్యారేజీ నుంచి 14,94,850 క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తోంది. శనివారం సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే స్థాయికి నీటిమట్టం తగ్గుముఖం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-08-20T01:25:12+05:30 IST