AP: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నిలకడగా నీటి ప్రవాహం

ABN , First Publish Date - 2021-07-18T15:18:53+05:30 IST

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. గోదావరి బ్యారేజ్ నీటిమట్టం 7.45 కొనసాగుతోంది. దీంతో అధికారులు లక్ష 19వేల క్యూసెక్కుల

AP: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నిలకడగా నీటి ప్రవాహం

తూర్పు గోదావరి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. గోదావరి బ్యారేజ్ నీటిమట్టం 7.45 కొనసాగుతోంది. దీంతో అధికారులు లక్ష 19వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మద్య, పశ్చిమ డెల్టాలకు 10 వేల క్యూసెక్కుల సాగు నీరు విడుదల చేశారు. మరోవైపు దేవీపట్నం మండలంలోని ముంపు గ్రామాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి. పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పునరావాస కాలనీలు, మైదాన ప్రాంతాలకు ముంపు గ్రామాల ప్రజలు తరలిపోతున్నారు.

Updated Date - 2021-07-18T15:18:53+05:30 IST