ఇటీవలి కాలంలో పలువురు కోలీవుడ్ హీరోయిన్లు గ్లామర్ ఎక్స్‌పోజింగ్‌లో పోటీ పడుతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు హీరోయిన్ దర్షా గుప్తా కూడా చేరింది. ఎరుపు రంగు దుస్తులు ధరించి, స్విమ్మింగ్‌పూల్‌లో ఆమె వీపు అందాలు చూపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. అలాగే ఫొటోలను కూడా అప్లోడ్ చేసింది. బుల్లితెర నుంచి బిగ్ స్ర్కీన్‌కు వచ్చిన నటీమణుల్లో ఆమె ఒకరు. దర్షా గుప్తాకు సోషల్ మీడియాలో ఫాలోయర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంది. దీంతో తన అభిమానులతో పాటు ఫాలోయర్లను అప్పుడప్పుడూ ఫిదా చేసేందుకు వీలుగా ప్రత్యేక ఫొటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోందీ అమ్మడు. ఇప్పుడు దర్షా గుప్తా ఈతకొలనులో దిగిన ఫొటోలతో పాటు ఒక వీడియోను కూడా సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో అది వైరల్‌గా మారింది.