నేడు కౌలు రైతుల సమస్యలపై ధర్నా

ABN , First Publish Date - 2020-09-28T11:40:36+05:30 IST

కౌలు రైతులకు డబుల్‌ ఫైనాన్స్‌తో సంబంధం లేకుండా పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల

నేడు కౌలు రైతుల సమస్యలపై ధర్నా

 డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ),సెప్టెంబరు27: కౌలు రైతులకు డబుల్‌ ఫైనాన్స్‌తో సంబంధం లేకుండా పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 28వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో రైతులు, కౌలు రైతులు పాల్గొనాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌, వి.రాజబాబు పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ సాగు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి కౌలు రైతులను పంటల బీమాలో నమోదు చేయాలని, సాగుదారులైన కౌలు రైతులను ఈ క్రాప్‌ బుకింగ్‌లో నమోదు చేయాలని, జాయింట్‌ లయబిలిటీ గ్రూపుల ద్వారా రుణాలు తీసుకున్న వారికి పావలా వడ్డీ రుణాలు వర్తింప చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ ధర్నా తలపెట్టామన్నారు. జిల్లాలో 4 లక్షలు పైబడి కౌలు రైతులు ఉన్నారని, 2019 సీఆర్‌సీ చట్టం ప్రకారం కౌలు రైతులకు   60 వేల లోపు మాత్రమే కార్డులు ఇచ్చారన్నారు. కార్డుదారులందరికీ రుణాలు ఇవ్వడం లేదని, భూ యజమానులు పంటలు వేయకుండా పంట రుణాలు తీసుకుంటున్నారన్నారు. వాస్తవ సాగుదారులను గుర్తించి వ్యవసాయశాఖ సాగు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2020-09-28T11:40:36+05:30 IST