Abn logo
Sep 25 2021 @ 00:21AM

స్కీమ్‌వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ధర్నా

కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తున్న దృశ్యం

నిర్మల్‌ టౌన్‌, సెప్టెంబరు 24 : స్కీమ్‌వర్కర్స్‌ సమస్యలను పరిష్కరించాలని జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన విపతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... స్కీమ్‌వర్కర్స్‌ను క్రమబద్ధీకరించి కనీసవేతనం 21 వేలు చెల్లించాలన్నారు. పెన్షన్‌నెలకు 10 వేలు చెల్లించి ఈఎస్‌ఐ ప్రావిడెంట్‌ ఫండ్‌ సౌకర్యాలను కల్పించి కొవిడ్‌సేవలు అందిస్తున్న స్కీమ్‌వర్కర్స్‌ అందరికీ రిస్కు అలవెన్స్‌ కింద రూ.10 వేల రూపాయలు అదనంగా చెల్లించాల న్నారు. కార్మికవ్యతిరేక 4 కోడ్లను ఉపసంహరించాలన్నారు. టీంవర్క్‌ వర్కర్‌ కేటగిరిలో చేర్చాలని, కొవిడ్‌వల్ల చనిపోయిన వారి కుటుంబానికి 50 లక్షల బీమా పథకం కింద నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ అఽ ద్యక్షురాలు సుజాత, ప్రధాన కార్యదర్శి సురేష్‌, అంగన్‌వాడీ హెల్త్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాజమణి, వనజ, శశికళ, లలిత, శైలజ, చంద్రకళ, గంగామణి, జ్యోతి, రామలక్ష్మి, గంగవ్వ, తదితరులు పాల్గొన్నారు. 

‘కార్మిక వ్యతిరేక విధానాలను సహించేది లేదు’

భైంసా, సెప్టెంబరు 24 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తే సహించేది లేదని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి రాంలక్ష్మణ్‌, సీఐటీయూ జిల్లా ప్రతినిధు పోశెట్టి, పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. హరితలు వెల్లడించారు. శుక్రవారం ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో స్కీమ్‌ వర్కర్లకు 21వేల వేతనాన్ని అందిస్తూ వారిని పర్మినెంట్‌ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో భైంసాలో నిర్వహించిన సమ్మె కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్మిక వర్గానికి ప్రమాదకరమైన 4 లేబర్‌కోడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదే క్రమంలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అసంఘటిత కార్మికవర్గానికి సామా జిక భద్రత కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండున్నలక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు నెలకు రూ. 5వేల నుంచి రూ. 12వేల లోపు అతి తక్కువ వేతనాలతో అష్టకష్టాలు పడుతూ బతుకుబండిని లాగిస్తున్నారని, వీరందరికి సమానపనికి సమానవేతనం అందివ్వాలన్నారు. సుప్రీంకోర్డు 2016 అక్టోబర్‌లో ఒకే రకమైన పనికి ఎక్కువ తక్కువ జీతాలు ఇవ్వకుండా సమాన పనికి, సమానవేతనం ఇవ్వాలని వెలువరించిన తీర్పుకు అనుగుణంగా వేతనా లను అమలు పరచాలన్నారు. అంతేగాకుండా వీరందరికి పీఎఫ్‌ ఈఎస్‌ఐ అమ లు చేయాలన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రోడ్ల మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి వినతిపత్రం అందజేశారు. ఇందులో భైంసా డివిజన్‌ పరిధిలోని అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్నభోజన పథకం, ఇందిరాక్రాంతి పథకం కార్మికులు, కేజీబీవీ, సర్వశిక్షఅభియాన్‌ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.