ఉద్యోగ భద్రత కల్పించాలని ధర్నా

ABN , First Publish Date - 2020-06-07T06:49:43+05:30 IST

ఉద్యోగ భద్రత కల్పించాలని మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌లు డిమాండ్‌ చేశారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని ధర్నా

విజయనగరం (ఆంధ్రజ్యోతి) జూన్‌ 6 :  ఉద్యోగ భద్రత కల్పించాలని మద్యం షాపుల్లో  పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మద్యం షాపుల్లో విధుల నుంచి తొలగించిన వారికి ప్రత్యామ్నాయం చూపాలని ప్లకార్డులు, బ్యానర్లతో నినాదాలు చేశారు. అనంతరం నాయుడు ఫంక్షన్‌ హాల్‌ వద్ద దివంగత నేత  వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి తమ సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. 


 స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు అశోక్‌, చిరంజీవి మాట్లాడుతూ... ఉద్యోగం వచ్చిన ఆనం దం ఆరు మాసాల్లో ఆవిరైపోయిందన్నారు. జిల్లాలో దశల వారీగా మద్యం దుకా ణాలను ఎత్తివేస్తే.. తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.  ఈ  సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు.  ఈ నిరసన కార్యక్రమంలో  జిల్లాలోని 13 సర్కిలో పనిచేస్తున్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-07T06:49:43+05:30 IST