విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దు

ABN , First Publish Date - 2021-03-02T05:39:50+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని సీఐటీయు కార్యదర్శి ఎం.సుందరబాబు డిమాండ్‌ చేశారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దు
చాగల్లులో భవన నిర్మాణ కార్మికుల నిరసన

కొవ్వూరు, మార్చి 1 : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ  నిలుపుదల చేయాలని  సీఐటీయు కార్యదర్శి ఎం.సుందరబాబు డిమాండ్‌ చేశారు. కొవ్వూరులో సోమవారం  సీఐటీయు, ఐఎఫ్‌టీయు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సుందరబాబు  మాట్లడుతూ రూ. 3 లక్షల కోట్ల విలువైన పరిశ్రమను దక్షిణ కొరియా సంస్థకు కేవలం రూ. 4 వేల కోట్లకు కట్టబెట్టడానికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు.  పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ, ఎన్జీవో అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు పెనుమాక జయరాజు,  సీహెచ్‌ రమేష్‌, నంబూరి మహర్షి, డి.అశోక్‌, ఇ.మల్లిక తదితరులు పాల్గొన్నారు.

చాగల్లు: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్రాహ్మణగూడెంలోని భవన నిర్మాణ కార్మికులు సోమవారం నిరసన తెలిపారు.   సీఐటీయూ నాయకురాలు కె. పోశమ్మ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈ నెల 5న జరిగే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.   శ్రీరామలింగ స్వామి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-02T05:39:50+05:30 IST