రెండో రోజూ రేషన డీలర్ల ధర్నా

ABN , First Publish Date - 2021-10-28T05:10:17+05:30 IST

తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని, జీవో నెంబరు 10ని వెంటనే రద్దు చేయాలని రేషన డీలర్లు బుధవారం రెండోరోజూ ధర్నా చేశారు.

రెండో రోజూ రేషన డీలర్ల ధర్నా
ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద నిరసన తెలుపుతున్న డీలర్లు


కర్నూలు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని, జీవో నెంబరు 10ని వెంటనే రద్దు చేయాలని రేషన డీలర్లు బుధవారం రెండోరోజూ ధర్నా చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా రేషన డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద నిరసన తెలిపారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఖాద్రీబాషా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా గోనె సంచులను తిరిగి ఇవ్వాలనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన ఆపేదిలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌, సిద్దయ్య, హనుమంతయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-10-28T05:10:17+05:30 IST