బకాయిలు చెల్లించాలని మామిడి రైతుల ధర్నా

ABN , First Publish Date - 2022-09-29T05:38:27+05:30 IST

బకాయిలు చెల్లించాలని కోరుతూ మామిడి రైతులు కిసాన్‌మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జాగర్లమూడి చంద్రశేఖర్‌నాయుడు ఆధ్వర్యంలో 100గొల్లపల్లె జైన్‌ఫ్యాక్టరీ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.

బకాయిలు చెల్లించాలని మామిడి రైతుల ధర్నా
ధర్నాలో మాట్లాడుతున్న రాష్ట్ర బీజేపీ కిసాన్‌మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి

గంగాధరనెల్లూరు, సెప్టెంబరు 28: బకాయిలు చెల్లించాలని కోరుతూ మామిడి రైతులు కిసాన్‌మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జాగర్లమూడి చంద్రశేఖర్‌నాయుడు ఆధ్వర్యంలో 100గొల్లపల్లె జైన్‌ఫ్యాక్టరీ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం తోలిన కాయలకు బిల్లులు ఇవ్వకపోవడంతో రెతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.  మామిడి పల్ప్‌ ఫ్యాక్టరీ యాజమానులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిండికేట్‌ చేయించి, రైతులను దగాచేశారని ఆరోపించారు. న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. అక్టోబరు 20వ తేదీలోపు బకాయిలు చెల్లిస్తామని ఫ్యాక్టరీ ప్రతినిధులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు సేతుకుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమశేఖర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు హరిబాబుచౌదరి, యువరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-29T05:38:27+05:30 IST