విద్యుత్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా

ABN , First Publish Date - 2022-08-09T06:01:17+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్‌ ఇండియా నేషనల్‌ కొఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయిస్‌ ఇంజనీర్స్‌ పిలుపుమేరకు జిల్లా విద్యుత్‌ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పవర్‌హౌజ్‌ కార్యాలయ ఆవరణలో నల్లచొక్కాలతో నిరసన వ్యక్తం చేశారు.

విద్యుత్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా

 విద్యుత్‌ సవరణ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

సుభాష్‌నగర్‌, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్‌ ఇండియా నేషనల్‌ కొఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయిస్‌ ఇంజనీర్స్‌ పిలుపుమేరకు జిల్లా విద్యుత్‌ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పవర్‌హౌజ్‌ కార్యాలయ ఆవరణలో నల్లచొక్కాలతో నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంలోనూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్‌ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్‌ రఘునందన్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మొండి వైఖరికి నిరసనగా ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్‌ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెడితే నిరవధిక సమ్మె కు వెల్లడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కేంద్ర మంత్రుల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. అనంతరం జేఏసీ కన్వీనర్‌ రెంజర్ల బాలేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విద్యుత్‌ సంస్థలను ఆదాని, అంబానీలకు దారాదత్తం చేయడానికి ప్రయత్నాలు చేస్తుందన్నా రు. కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర వెల్ఫేర్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు ఎండీ ముక్తార్‌, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

తక్షణమే బిల్లులను వెనక్కి తీసుకోవాలి

మెండోర: విద్యుత్‌ చట్టసవరణ బిల్లు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ లోకసభలో ప్రవేశ పెట్టనున్న బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని విద్యుత్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బిల్లుకు వ్యతిరేకంగా పోచంపాడ్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. రైతాంగానికి వ్యతిరేకంగా బిల్లు ఉందని, రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకుం టుందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసవరణ ముందు రాష్ట్రాలతో లోతుగా అభిప్రాయాలు తీసుకో వాలన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్‌, రాష్ట్ర యునియన్‌ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T06:01:17+05:30 IST