చిత్తూరు: జిల్లాలో గాంధీ విగ్రహం దగ్గర అంగన్వాడీ వర్కర్లు ధర్నాకు దిగారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ వేతనం రూ. 24 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఏఐటీయూసీ ధర్నాకు మద్దతు ప్రకటించింది.