రైతుల మహాధర్నా

ABN , First Publish Date - 2022-01-22T06:32:43+05:30 IST

మిరప, చెరకు, ధాన్యం రైతుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 28న కమిషనర్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు రైతుసంఘాల నేతలు పేర్కొన్నారు.

రైతుల మహాధర్నా

విజయవాడ సిటీ, జనవరి 21 : మిరప, చెరకు, ధాన్యం రైతుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 28న కమిషనర్‌ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు రైతుసంఘాల నేతలు పేర్కొన్నారు. రైతుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక ధర్నాచౌక్‌లో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా చేపట్టారు. తామర పురుగు వల్ల నష్టపోయిన మిరప రైతు, కౌలురైతులకు ఎకరానికి రూ.లక్ష నష్ట పరిహారం చెల్లించాలని, ఆర్బీకే కేంద్రాలే నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి 72 గంటల్లోనే నగదు జమ చేయాలని, దేవదాయల కౌలు శిస్తులను రద్దు చేసి కౌలురైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 5లక్షల ఎకరాల్లో మిర్చిపంట తామర పురుగు వల్ల నాశనమైందని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.కేశవరావు తెలిపా రు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ ఆకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ మిల్లర్ల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలన్నారు. ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, యల్లా మందారావు, అఖిల భారత కిసాన్‌ మహాసభ నేత డి.హరినాథ్‌, ఎం.వెంకట్‌రెడ్డి, కొల్లా రాజమోహన్‌, వీరబాబు, ఎం.ప్రసాద్‌ తదితర రైతు, వ్యవసాయ సంఘాల నేతలతో పాటు అఽధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T06:32:43+05:30 IST