Abn logo
Oct 27 2021 @ 22:38PM

రెండో రోజు రేషన్‌ డీలర్ల ధర్నా

కావలి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద ధర్నా చేస్తున్న రేషన్‌ డీలర్లు

కావలి, అక్టోబరు 27: రేషన్‌ డీలర్ల సమస్యల పరిష్కారంలో భాగంగా బుధవారం రెండోవరోజు రేషన్‌ డీలర్లు కావలి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ గతంలో లాగా ఖాళీ గోనె సంచులు రేషన్‌ డీలర్లకే ఇవ్వాలని, కరోనా సమయంలో పంపిణీ చేసిన శనగలు, కందిపప్పుకు కమిషన్‌ ఇవ్వాలని కోరారు.  2021 జనవరిలో డీలర్లు డీడీలు కట్టి తెచ్చుకున్న కందిపప్పును ఐసీడీఎస్‌కు ఉచితంగా పంపిణీ చేయించారని దానికి సంబంధించిన డబ్బులను వెంటనే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా నాయకులు సుదర్శన్‌ రమేష్‌, మన్నులూరు రమేష్‌, షేక్‌ జమీల, కావలి మండల అధ్యక్షుడు పీఎల్‌వీ నారాయణ, బోగోలు మండల అధ్యక్షుడు సురే్‌షరెడ్డి, జలదంకి మండల అధ్యక్షుడు బెజవాడ వెంకటరత్నం, రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు.