Abn logo
Sep 27 2021 @ 00:05AM

పోలీసుస్టేషన ఎదుట ధర్నా

పోలీసు స్టేషన ఎదుట ధర్నాకు దిగిన మహిళలు

రామగిరి ఎగువతండా టీడీపీ వర్గీయుల ఆందోళన 

కౌన్సెలింగ్‌ నెపంతో సీఐ చితకబాదాడంటూ ఆరోపణ


పామిడి, సెప్టెంబరు 26: పట్టణంలోని పోలీసుస్టేషన ఎదుట ఉద్రిక్త త చోటుచేసుకుంది. మండలంలోని రామగిరి ఎగువతండాకు చెందిన టీడీ పీ వర్గీయులు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. బీసీసీ రోడ్డుపై మహిళలు, యువకులు బైఠాయించారు. సీఐ డౌన.. డౌన అంటూ నినాదాలు చే శారు. బాధితులు తెలిపిన వివరాలివి. నాటుసారా తయారీతో పాటు ఇద్ద రు వైసీపీ నాయకుల ఇళ్లపై దాడి చేశారంటూ పామిడి సీఐ శ్యామరావు టీడీపీకి చెందిన పలువురిని వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కౌన్సెలింగ్‌ పేరుతో ఆదివారం ఏడుగురిని చితకబాదాడంటూ ఆరోపించారు. వైసీపీ నాయకులు నాటుసారా తయారీ చేసి బహిరంగంగా విక్రయిస్తున్నా ఎ లాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అయితే సంబంధం లేని వారిపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కోసం రా జంపేట, బెంగుళూరు తదితర ప్రాంతాలకు వెళ్లిన వారిని ఎప్పుడు పడితే అప్పుడు పోలీసుస్టేషనకు పిలిపించి సాయంత్రం వరకూ కూర్చోబెట్టి ఇళ్ల కు పంపి, రేపు రండి అంటూ తిప్పుతున్నారన్నారు. రామగిరి ఎగువతండా పంచాయతీకి చెందిన ఇద్దరు వైసీపీ నాయకుల ప్రొద్బలంతోనే తమ వా రిపై సీఐ వేధిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించాలనే ఈ వే ధింపులకు పాల్పడుతున్నారని వారు వాపోయారు.


బెంగుళూరుకు ఉపాధి కోసం వలస వెళ్లి వచ్చిన రాజే్‌షనాయక్‌ నాటుసారా తయారీ చేస్తున్నావం టూ సీఐ కొట్టాడని ఆ యువకుడు వాపోయాడు. రాజంపేటలో కూలీ ప నులు చేసుకునే తనపైనా వేధింపులు ఉన్నాయంటూ గోపాల్‌నాయక్‌ ఆరోపించారు. ఈ విషయంపై సీఐ శ్యామరావు మాట్లాడుతూ.. ఎస్పీ ఫక్కీరప్ప కార్యాలయం నుంచి గుట్కా, కర్ణాటక మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీ, విక్రయదారులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. దీంతో వారిని పిలిపించి హెచ్చరించామన్నారు. ఎవరిపైనా ఎలాంటి వివక్ష లేదన్నారు. నాటుసారాను సంపూర్ణంగా అరికట్టాలని గట్టిగా మందలించినందుకే ఇలా ఆందోళన చేయడం సరికాదని ఆయన తెలిపారు.