సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఎదుట ధర్నా

ABN , First Publish Date - 2020-10-20T07:20:22+05:30 IST

నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 60 ఏళ్లు దాటిన కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించి వారి స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది

సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఎదుట ధర్నా

కరీంనగర్‌ టౌన్‌ : నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 60 ఏళ్లు దాటిన కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించి వారి స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. సోమవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా నాయకులు శ్రీనివాస్‌, శేఖర్‌, బోయిని ఎల్లమ్మ, కల్లెపల్లి లచ్చయ్య, ఆరేళ్ల రాజయ్య, అందె కొమురయ్య, లింగంపల్లి లక్ష్మి, బోయిని మల్లయ్య, మంద లక్ష్మి తదితరులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20, 30 సంవత్సరాలుగా మున్సిపల్‌లో పనిచేస్తున్న వారిలో 60 ఏళ్లు దాటిన వారిని పనిలో నుంచి తొలగించడంతో వారు తీవ్ర ఆందోళనతో వెనుదిరుగుతు న్నారని, వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను నియమించి వారికి న్యాయం చేయాలని కోరారు. కొంత మంది అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘ నాయకులు 60 ఏళ్లు నిండిన కార్మికులను తొలగించి వారి స్థానంలో లక్షల రూపాయలను అక్ర మంగా వసూలు చేసి ఉద్యోగం ఇప్పిస్తున్నారని, ఈ అక్రమ దందాపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరారు. అనంతరం కమిషనర్‌ వల్లూరి క్రాంతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 

Updated Date - 2020-10-20T07:20:22+05:30 IST