3న ఎన్‌సీఎస్‌ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా : సీపీఎం

ABN , First Publish Date - 2021-10-19T05:27:58+05:30 IST

చెరకు రైతుల సమస్యలు, బకాయిల చెల్లింపునకు సంబంధించి వచ్చే నెల 3న లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం ముందు ధర్నా చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు , నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి తెలిపారు.

3న ఎన్‌సీఎస్‌ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా : సీపీఎం

 బొబ్బిలిరూరల్‌ :  చెరకు రైతుల సమస్యలు, బకాయిల చెల్లింపునకు సంబంధించి వచ్చే నెల 3న లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం ముందు ధర్నా చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు , నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి తెలిపారు. సోమవారం స్థానిక సీఐటీయూ కార్యా లయంలో   చెరకు రైతులతో సమావేశం నిర్వహించారు.   చెరకు రైతుల, కార్మికుల  సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుం డడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.  సుమారు రూ. 24 కోట్ల మేర  బకాయిలు చెల్లించకుండా  యాజమాన్యం ఉన్నప్పటికీ   సర్కార్‌ ఎందుకు పట్టించుకోవడం లేదని  ప్రశ్నించారు.  తక్షణమే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని, బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  స్థానిక జూట్‌మిల్లు కార్మికులకు కూడా న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో చెరకు రైతు జిల్లా సంఘం కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు, నాయకులు అప్పారావు, ప్రసాద్‌, రమణమూర్తి, భూషణ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-19T05:27:58+05:30 IST