ఫీజు దోపిడీని నిరసిస్తూ ఇంటర్‌ బోర్డు వద్ద ధర్నా

ABN , First Publish Date - 2021-03-06T08:35:08+05:30 IST

అధిక ఫీజులు వసూలు చేయకుండా ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలను కట్టడి చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం బీజేవైఎం ఆధ్వర్యంలో ఇండర్మీడియట్‌ బోర్డు ముట్టడిని చేపట్టారు.

ఫీజు దోపిడీని నిరసిస్తూ ఇంటర్‌ బోర్డు వద్ద ధర్నా

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అధిక  ఫీజులు వసూలు చేయకుండా ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలను కట్టడి చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం బీజేవైఎం ఆధ్వర్యంలో ఇండర్మీడియట్‌ బోర్డు ముట్టడిని చేపట్టారు. కరోనా కాలంలో తొలిగించిన దాదాపు 6వేల మంది లెక్చరర్లను, టీచర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బీజేవైఎం డిమాండ్‌ చేసింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌ ఆధ్వర్యంలో యువమోర్చా కార్యకర్తలు, విద్యార్థులు ఈ ధర్నా చేయగా వారిని  పోలీసులు అరెస్టు చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-03-06T08:35:08+05:30 IST