Jul 8 2021 @ 06:09AM

దిలీప్ కుమార్ మృతితో కుంగిపోయిన ధర్మేంద్ర

బాలీవుడ్ మహానటుడు దిలీప్ కుమార్ మృతితో బాలీవుడ్ మూగబోయింది. దిలీప్ మృతిచెందారన్నవార్త తెలియగానే నాటి నటుడు ధర్మేంద్ర ఎంతగానో కుంగిపోయారు. దిలీప్, ధర్మేంద్రలు పలు సూపర్ హిట్ సినిమాలలో కలిసి నటించడంతో పాటు అన్నదమ్ములుగా మెలిగారు. దిలీప్‌ను కడసారి చూసేందుకు వచ్చిన ధర్మేంధ్ర అతని పార్థివ శరీరాన్ని చూసి, కన్నీరు పెట్టుకున్నారు. 

ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ మాట్లాడుతూ దిలీప్ తనకు సోదరుని లాంటివాడని, అతనిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. దిలీప్ తన ఇంటికి వచ్చినప్పుడల్లా, ఎంతో ఆత్మీయత చూపేవారన్నారు. దిలీప్ పరాయి వ్యక్తి అనే భావన ఏనాడూ కలగలేదన్నారు. ఇకపై అతని స్మృతులతోనే జీవించాలని అన్నారు. 

Bollywoodమరిన్ని...