అనంతపురం: రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి నమ్మకాన్ని కొంతమంది వలంటీర్లు వమ్ముచేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గంలోనే 267 మంది వలంటీర్లను విధుల నుంచి తొలగించామన్నారు. కరోనా సమయంలో ప్రజా ప్రతినిధులు బయటకు రాకపోవడాన్ని అలుసుగా చేసుకొని అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు.