ఆర్య సత్యాలలో ధర్మసారం

ABN , First Publish Date - 2021-10-08T05:54:45+05:30 IST

బౌద్ధ ధర్మంలో... బుద్ధుడు బోధించిన ఆర్య సత్యాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఆర్య సత్యాలను పాళీ భాషలో ‘అరియ సచ్ఛా’ అంటారు.

ఆర్య సత్యాలలో ధర్మసారం

అంతరార్థం

బౌద్ధ ధర్మంలో... బుద్ధుడు బోధించిన ఆర్య సత్యాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఆర్య సత్యాలను పాళీ భాషలో ‘అరియ సచ్ఛా’ అంటారు. ‘అరియ’ అంటే గొప్ప అని. ఇవి నాలుగు, బౌద్ధ ధర్మసారమంతా ఈ నాలుగు సత్యాల్లోనే ఉంటుంది. వాటిలో-

మొదటిది: దుఃఖం సత్యం

రెండోది: ఆ దుఃఖానికి కొన్ని కారణాలు ఉంటాయి. వాటిని ‘సముదయం’ అంటారు. ఈ దుఃఖ సముదయం సత్యం.

మూడోది: దుఃఖ నిరోధం సత్యం. దుఃఖ కారణాలను నిరోధించవచ్చు. 

నాలుగోది: దుఃఖ నిరోధ మార్గం సత్యం. అంటే... దుఃఖ కారణాలను నిరోధించే మార్గం కూడా ఉంటుంది. ఆ మార్గమే... ఆర్య అష్టాంగ మార్గం!

Updated Date - 2021-10-08T05:54:45+05:30 IST