బాధ్యతలు స్వీకరించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు

ABN , First Publish Date - 2022-04-13T17:13:30+05:30 IST

ధర్మాన ప్రసాదరావు మంత్రిగా బుధవారం సచివాలయంలోని 5వ బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు

అమరావతి: ధర్మాన ప్రసాదరావు మంత్రిగా బుధవారం సచివాలయంలోని 5వ బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలు కేటాయించారు. ఈ సందర్భంగ మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యాలు అభిప్రాయాలు నెరవేర్చడానికి తామంతా కలిసి పనిచేయడం ప్రజాస్వామ్యంలో ముఖ్యమన్నారు. రెవిన్యూ కాదిది, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే బావుండేదన్నారు. సీనియర్ అధికారులతో కలిసి ఒక టీంగా పనిచేయడం తన అలవాటన్నారు. భూములు అనేక చట్టాలు మూలంగా వివాదాల్లో చిక్కుకొని ఫ్రీ హోల్డ్ కాకుండా అయిపోతాయని, దీనివల్ల మనీ టాప్ చేయడం కుదరదన్నారు. అందుకే ఫ్రీ హోల్డ్‌లోకి తేవడం కోసమే ఇప్పుడు సర్వే చేస్తున్నామన్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున నిధులు మార్కెట్‌లోకి వస్తాయని, చాలా అంశాలు చాలేంజ్‌గా తీసుకొని ముందుకు వెళతామని ధర్మాన ప్రసాదరావు అన్నారు.

Updated Date - 2022-04-13T17:13:30+05:30 IST