Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 07 Jul 2022 00:54:44 IST

కదిలింది ధర్మచక్రం

twitter-iconwatsapp-iconfb-icon

సంకేత్‌ తిరుమనీడి, మోనికా చౌహాన్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘ధర్మచక్రం’. ఇటీవలె పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నాగ్‌ ముంత దర్శకత్వంలో జి.పి. రెడ్డి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి వరుణ్‌ క్లాప్‌ ఇవ్వగా, రాజశేఖర్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఎం శ్రీధర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. జీపీ రెడ్డి మాట్లాడుతూ ‘సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో దర్శకుడు రాసుకున్న కథ ఇది. సెప్టెంబరులో విడుదల చేస్తాం’ అన్నారు. నాగ్‌ ముంత మాట్లాడుతూ ‘ఆడవాళ్లు తమను తాము ఎలా రక్షించుకోవాలో ఈ చిత్రంలో చూపించాం. హీరోయిన్‌ రెండు రోల్స్‌ చేస్తున్నారు’ అని చెప్పారు. ఈ చిత్రానికి ప్రణయ్‌  సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఎం. ఆనంద్‌

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International