దారిమళ్లుతున్న పేదల బియ్యం

ABN , First Publish Date - 2021-06-23T07:01:17+05:30 IST

మండలంలో రేషన్‌ డీలర్లు అక్రమ బియ్యం రవాణాతో రెచ్చిపోతున్నారు.

దారిమళ్లుతున్న పేదల బియ్యం
వ్యాన్‌లో అక్రమంగా తరలిపోతున్న రేషన్‌ బియ్యం (ఫైల్‌)

ప్రతినెలా యథేచ్ఛగా అక్రమ రవాణా

వ్యాపారులకు కొందరు అధికారుల అండ

చోద్యం చూస్తున్న అధికారులు

పొదిలి (రూరల్‌), జూన్‌ 22 : మండలంలో రేషన్‌ డీలర్లు అక్రమ బియ్యం రవాణాతో  రెచ్చిపోతున్నారు. గు ట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యాపారాని కి అధి కారులు సహాయ సహాకారాలు అందిస్తుండటంతో అక్ర మార్కుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తోంది. అక్రమ బియ్యం వ్యాపారానికి మండల డీలర్లు మొత్తం సిండికేట్‌గా మారి ఇతర ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యం కొనడానికి వస్తే దాడి చేయడానికి కూడా వెనుకాడటం లేదంటే అక్రమార్కులకు వ్యాపారం ఏస్థాయిలో జరుగుతుందో ఇట్టే అర్థమవుతుంది. 

అయితే, పాత వ్యాపారస్తులకన్నా  రెండు రూ పాయ లు ఎక్కువ ఇవ్యవడంతో అందరూ కొత్త వ్యక్తికి రేషన్‌ అమ్ముతున్నారు. 

దీనిని కొంత మంది డీల ర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. మండలంలోని కుంచేపల్లి పంచాయతీలోని దా సర్లపల్లి  గ్రామంలో దర్శికి చెం దిన వ్యాపారస్తుడు, హోటల్‌ యజమాని ప్రతినెలా 20 నుం చి 30 క్వింటాళ్లు బియ్యం కొను గోలు చేస్తాడు. అదేక్రమంలో రెండు రోజుల క్రితం కొనుగోలు నిమిత్తం ఆ గ్రామా నికి వచ్చాడు. మండలానికి చెం దిన కొంత మంది  డీలర్లతో పాటు మరి కొంత మంది గ్రా మస్థులు అత నిపై దాడి చేశారు. ఇద్దరు చేస్తున్నది దొంగ వ్యాపారమైనందున గుట్టు చప్పుడు కాకుండా ఇరువురూ మిన్నకుండిపోయారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్ర జా పంపిణీ వ్యవస్థ కొంత మంది అక్రమార్కుల జేబు లు నింపుకునేందుకు ఆసరాగా మారింది. ఇంటింటికి రేషన్‌ పేరుతో ప్రభుత్వం ప్రవేవ పెట్టిన పథకం ఆదిలోనే నీరుగారిపోయింది. గతంలో రేషన్‌ డీలర్లు వ్యాపారం చేసేవారు.   ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా పోవడంతో అందరూ ఈ వ్యాపారంలోకి దిగారు.   ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి  పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని నల్ల బజారుకు తరలకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

70 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

తర్లుపాడు : తర్లుపాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఎస్‌ఐ ఆవుల వెంక టేశ్వర్లు మంగళవారం పట్టుకొన్నారు. మండలంలోని తర్లుపాడు పరిసర ప్రాంతాల్లో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి మార్కాపురంకు వ్యాన్‌లో తరలిస్తున్నారు. ఈక్రమంలో తర్లుపాడు బస్టాండ్‌ సెంటర్‌లో తెల్లవారుజామున వ్యాన్‌ ను తనిఖీ చేయగా 70 బస్తాల రేషన్‌ బి య్యం ఉన్నట్లు గుర్తించారు. వ్యాన్‌ నడుపుతున్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా మార్కాపురం పట్టణంలో ఇద్దరు వ్యాపారస్తులు కొనుగోలు చేసిన బియ్యాన్ని తీసుకెళ్తున్నట్లు తెలిపాడు. 

మండలంలో విచ్చలవిడిగా రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి మార్కాపురం పట్టణానికి తీసుకెళ్లి అక్కడ్నుంచి నెల్లూరు, చెన్నై పోర్టులకు అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్‌ను సీజ్‌ చేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఎస్‌ఐ ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు. బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్‌ సత్యం, హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణారెడ్డి, రమేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T07:01:17+05:30 IST